Tillu Square: కథ లేకున్నా కలెక్షన్లు.. టాలీవుడ్ నయా ట్రెండ్..

కథే లేకుండా కాసులు కురిపించే సినిమాలున్నాయి. జాతి రత్నాలు మూవీలో కథకంటే, కామెడీ సీన్లు, పాత్రలే తప్ప అందులో ఏముంది అన్నారు. సరే.. కనీసం అందులో ఓ మంచి పాయింట్‌కి కామెడీ సీన్లు జోడించారనుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 30, 2024 | 05:52 PMLast Updated on: Mar 30, 2024 | 5:52 PM

Tillu Square And Om Bheem Bush Movies Became Hit Without Proper Story

Tillu Square: తాము బడ్జెట్‌ని కాదు, కంటెంట్‌ని నమ్ముకున్నాం. కాబట్టే సినిమా తీశాం.. కథే మమ్ముల్ని గెలిపిస్తుంది.. అంటూ దర్శక నిర్మాతలు చెబుతుంటారు. ఈమధ్య సినిమాలో కథే లేకున్నా సరికొత్త కథ, మమ్మల్ని గెలిపించే కథ అని చాలా మంది దర్శక నిర్మాతలు డబ్బాలు కొడుతున్నారు. కాని కథే లేకుండా కాసులు కురిపించే సినిమాలున్నాయి. జాతి రత్నాలు మూవీలో కథకంటే, కామెడీ సీన్లు, పాత్రలే తప్ప అందులో ఏముంది అన్నారు.

Daniel Balaji: మానవత్వం.. డేనియల్‌ బాలాజీ నేత్ర దానం

సరే.. కనీసం అందులో ఓ మంచి పాయింట్‌కి కామెడీ సీన్లు జోడించారనుకోవచ్చు. మరి ఓం భీం బుష్ సంగతేంటి..? చాలా మంది శ్రీ విష్ణు నటన తప్ప ఇందులో ఏముందన్నారు. రివ్యూలు కూడా మంత్రాలకు చింతకాయలు రాలవన్నారు. నిజమే ఓం భీమ్ బుష్ మూవీలో కథ, కాకరకాయ కనిపించదు. ఏదో ఒక కథ చెప్పాలన్నట్టు ఓ పాయింట్ అనుకుని దానికి జాతిరత్నాలు ప్రేరణతో కామెడీ డైలాగ్స్‌ని యాడ్ చేసి సినిమా విడుదల చేశారు. విచిత్రంగా రిలీజైన 3 రోజుల్లోనే రూ.20 కోట్లు రాబట్టింది ఈ మూవీ. అంతకంటే విచిత్రంగా ఇప్పుడు టిల్లూ స్క్వేర్ మూవీ కథలో రెండు పాయింట్స్ వదిలేస్తే, ఇది డీజే టిల్లూని మరో వర్షన్‌లో చూస్తున్నామా అన్నట్టుంది.

కానీ, ఇది కూడా కోట్లు రాబట్టేస్తోంది. ఓం భీమ్ బుష్‌కి శ్రీవిష్ణు మీదున్న నమ్మకం, యూత్‌కు నచ్చే డైలాగ్స్ కలిసొస్తే, టిల్లూ స్క్వేర్‌కి వన్ లైనర్ పంచ్‌లు కలిసొచ్చాయి. సిద్దు వన్ మ్యాన్ షోతో కాసులు కురిపిస్తోంది టిల్లూ స్క్వేర్.