Tillu Square: మాస్ బ్యాటింగ్.. 100 కోట్ల వైపు దూసుకెళ్తున్న టిల్లుగాడు

మొదటి రోజే పాతిక కోట్ల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ అందుకుందంటే.. టిల్లుగాడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల్లో 45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఫస్ట్ వీకెండ్‌లో 68 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2024 | 02:40 PMLast Updated on: Apr 02, 2024 | 2:40 PM

Tillu Square Box Office Collections Will Reach Rs 100 Crores Soon

Tillu Square: డీజే టిల్లుగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ చేసిన రచ్చకు యూత్ ఫిదా అయిపోయింది. దీంతో సీక్వెల్‌పై మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక మార్చి 29న ఆడియెన్స్ ముందుకొచ్చిన సీక్వెల్ మూవీ టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా భారీ వసూళ్లను అందుకుంటోంది. మొదటి రోజే పాతిక కోట్ల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ అందుకుందంటే.. టిల్లుగాడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Urvashi Rautela: నా హైట్ కూడా లేరు.. పంత్‌ను మళ్లీ టార్గెట్ చేసిన ఊర్వశి

రెండు రోజుల్లో 45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఫస్ట్ వీకెండ్‌లో 68 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో.. ఈ వీకెండ్లో ఇండియా మొత్తానికి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది టిల్లు స్క్వేర్. ఈ లెక్కన టిల్లు స్క్వేర్ సెకండ్ వీకెండ్‌ వరకు వంద కోట్ల క్లబ్‌లో చేరడం గ్యారెంటీ. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే నిర్మాత నాగవంశీ ఓపెనింగ్స్ 25 కోట్లు, లాంగ్ రన్‌లో 100 కోట్లు రాబడుతుందని చెప్పాడు. చెప్పినట్టే ఈ సినిమాకు సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. మండే నుంచి వసూళ్లు కాస్త తగ్గినా కూడా థియేటర్లో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నాలుగో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో మూడున్నర నుంచి నాలుగు కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఐదు కోట్ల వరకు నెట్ రాబట్టినట్టుగా చెబుతున్నారు.

మేకర్స్ నుంచి కూడా అఫీషియల్ పోస్టర్ వచ్చేసింది. నాలుగో రోజు పది కోట్ల గ్రాస్ రాబట్టి.. మొత్తంగా 78 కోట్లు వసూలు చేసింది టిల్లు స్క్వేర్. మరో మూడు రోజులు అయితే.. మళ్లీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఉగాది హాలీడేస్ కూడా కలిసి రానున్నాయి. కాబట్టి.. టిల్లుగాడికి వంద కోట్లు రావడం పక్కా అంటున్నారు. ఏదేమైనా.. టిల్లు స్క్వేర్ సినిమాకు భారీ లాభాలు రావడం గ్యారెంటీ.