Tillu Square: ఓటీటీలోకి వస్తున్న టిల్లు స్క్వేర్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
రెండేళ్లక్రితం విడుదలైన డీజే టిల్లూకు సీక్వెల్‌గా వచ్చింది టిల్లూ స్క్వేర్. గత మార్చి 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన 9 రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది.
Tillu Square: థియేటర్లలో సందడి చేస్తున్న టిల్లు గాడు.. ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ నెల 26 నుంచి టిల్లు స్క్వేర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
TOLLYWOOD: నార్త్ మార్కెట్‌లో దూసుకుపోతున్న తెలుగు హీరోలు.. కో అంటే కోట్లు..
రెండేళ్లక్రితం విడుదలైన డీజే టిల్లూకు సీక్వెల్‌గా వచ్చింది టిల్లూ స్క్వేర్. గత మార్చి 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన 9 రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఫస్ట్ వీక్‌లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు అందించింది. దాదాపు రూ.40 కోట్లకుపైగా లాభాలు అందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.120పైగా కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సిద్ధూ ఈ సినిమాతో తొలిసారి వంద కోట్ల క్లబ్బులో చేరాడు. టిల్లూగా సిద్ధూ జొన్నలగడ్డ కామెడీకి యూత్ ఫిదా అయ్యారు. హీరోయిన్‌గా నటించిన అనుపమా పరమేశ్వరన్ గ్లామర్ ఈ చిత్రానికి మరో హైలైట్.
టిల్లు స్క్వేర్’ పాటలకు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సింగీతం అందించగా భీమ్స్ సిసిరోలియో బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ అందించారు. సిద్ధూ జొన్నలగడ్డ ఈ చిత్రానికి రచయిత కాగా.. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. రెండో పార్ట్ కూడా సక్సెస్ కావడంతో టిల్లూ మూడో సీక్వెల్ కూడా త్వరలోనే తెరకెక్కనుంది. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి ఓటీటీలో అలరించేందుకు సిద్ధంగా ఉంది.
History repeat avvadam normal. Adhe Tillu vasthe History, mystery, chemistry anni repeat avvuthai. Atluntadhi Tilluthoni. ✨🥰
Tillu Square arrives on 26 April, on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi. pic.twitter.com/SwEzFgJujb— Netflix India South (@Netflix_INSouth) April 19, 2024