Tillu Cube : పూజాహెగ్డేను పట్టేసిన టిల్లుగాడు
టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో (Young Hero) సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమా ఎంత బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజె టిల్లుగా తన యస, భాషతో తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు సిద్ధూ. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రాధికా పాత్ర హైలెట్‌గా నిలిచింది.

Tillugad caught Pooja Hegde
టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో (Young Hero) సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమా ఎంత బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజె టిల్లుగా తన యస, భాషతో తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు సిద్ధూ. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రాధికా పాత్ర హైలెట్‌గా నిలిచింది. రాధిక రోల్‌లో యంగ్ హీరోయిన్ నేహా శెట్టి నటించింది. తన అందాని యూత్ ఫిదా అయ్యారు. ఇక సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ (Tillu Square2) అంతకుమించిన హిట్ అందుకుంది. ఏకంగా 135 కోట్ల వరకు వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. అనుపమ కూడా టిల్లు గాడి కోసం ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అయితే.. టిల్లు క్యూబ్‌లో మరో హీరోయిన్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు టిల్లుగాడు. ఇప్పటికే ‘టిల్లు క్యూబ్’ అనౌన్స్ చేశారు మేకర్స్. కాకపోతే ఈ సినిమా రావడానికి కాస్త లేట్ అయ్యేలా ఉంది. కానీ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఈ నేపథ్యంలో.. టిల్లు క్యూబ్‌లో హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ పూజాహెగ్డే (Pooja Hegde) ను తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
సినిమాల పరంగా.. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి అస్సలు బాగాలేదు. చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో.. ఓ మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తోంది బుట్టబొమ్మ. అలాంటి బ్యూటీకి సూపర్ హిట్ సీక్వెల్‌లో ఛాన్స్ అంటే.. సూపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే ఇలాంటి వార్తల్లో నిజమెంతో తెలియాలంటే.. చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.