Pushpa 2 : పుష్ప 2 సెకండ్ సింగిల్ కు టైం ఫిక్స్…

అల్లు అర్జున్‌ ను పాన్ ఇండియానే కాదు గ్లోబల్‌ బాక్సాఫీస్‌కు పరిచయం చేసిన మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ పుష్ప2 సైతం విడుదలకు సన్నద్దం అవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 28, 2024 | 06:15 PMLast Updated on: May 28, 2024 | 6:15 PM

Time Fix For Pushpa 2 Second Single

అల్లు అర్జున్‌ ను పాన్ ఇండియానే కాదు గ్లోబల్‌ బాక్సాఫీస్‌కు పరిచయం చేసిన మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ పుష్ప2 సైతం విడుదలకు సన్నద్దం అవుతుంది. ఇటీవలే విడుదల చేసిన పుష్ప.. పుష్ప సాంగ్ మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. తాజాగా మరో పాటను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధం అయ్మారు. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అవగా ఇప్పుడు విడుదల చేయబోయే పాట కపుల్ సాంగ్ అని తెలుస్తుంది. పాటను పరిచయం చేస్తూ ఈ మధ్య ఓ గ్లింప్స్ సైతం విడుదల చేశారు. ఆ వీడియో కేశవ సెకండ్ పాట గురించి రష్మికను అడుగుతాడు. దానికి రష్మిక స్టైల్‌గా చేతి వేళ్లు పెట్టి సూసెకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ పాడుతుంది. దాంతో ఈ పాట కూడా నా సామి పాట అంత సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో ఈ సాంగ్ అప్డేట్ ఇస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాటను రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బన్నీ, శ్రీవల్లి లుక్ అదిరిపోయింది. అల్లు అర్జున్ బ్లాక్‌ టీ షర్ట్ వేసుకోగా.. రష్మిక బ్లాక్ ప్యాంట్‌ టీ షర్ట్‌లో వోణీ వేసుకొని ఉంది. ఇందులో రష్మిక గెటప్ చాలా ట్రెండీగా కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను పాపులర్ సింగర్ శ్రేయాఘోషల్ ‌ పాడింది. పాన్ ఇండియా అన్ని భాషాలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీలో మొత్తం శ్రేయా ఘోషల్‌ పాడటం విశేషం.

ఎంతో మందిని ఊరిస్తున్న ఈ పాట మే 29న విడుదల కానుంది. సెకండ్ పార్ట్ గురించి దేశం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగ‌స్టు 15న ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.