Pushpa 2 : డిసెంబర్ 19న పుష్ప2 రిలీజ్
నిజం చెప్పాలంటే.. తెలుగులో కంటే మిగతా భాషల్లోనే దుమ్ముదులిపేశాడు పుష్పరాజ్ (Pushpa Raj). ఊహించని రిజల్ట్‌తో సుకుమార్ (Sukumar) కూడా ఆశ్చర్యపోయాడు.

To be honest.. Pushparaj has made dust in other languages than in Telugu.
నిజం చెప్పాలంటే.. తెలుగులో కంటే మిగతా భాషల్లోనే దుమ్ముదులిపేశాడు పుష్పరాజ్ (Pushpa Raj). ఊహించని రిజల్ట్‌తో సుకుమార్ (Sukumar) కూడా ఆశ్చర్యపోయాడు. ముఖ్యంగా నార్త్‌లో పుష్పరాజ్‌కు బ్రహ్మరథం పట్టారు ఆడియెన్స్. అక్కడ భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా 350 కోట్లకు పైగా రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది పుష్ప మొదటి భాగం. ఆ తర్వాత బన్నీకి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టింది. అలాంటప్పుడు.. పుష్ప సెకండ్ పార్ట్‌ని సుకుమార్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఒక్క తెలుగు వరకు అనుకున్నప్పడే ఆ రేంజ్ మాసివ్ అవుట్ పుట్ ఇస్తే.. ఇక పాన్ ఇండియా (Pan India) రేంజ్ అంటే సుకుమార్ స్కెచ్ మామూలుగా ఉండదు. అందుకే.. పుష్ప2ని ఒక శిల్పాన్ని చెక్కుతున్నట్టుగా చెక్కుతున్నాడు. దానికోసం మూడేళ్ల సమయం తీసుకుంటున్నాడనే చెప్పాలి. పుష్ప పార్ట్ వన్ 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయింది
అయితే.. పెరిగిన అంచనాలు అందుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు సుకుమార్. అయినా కూడా 2024 ఆగష్టు 15న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ ఇప్పుడు పుష్ప2 పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో.. ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. ఎందుకంటే.. సెప్టెంబర్‌లో దేవర (Devara), అక్టోబర్‌లో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలు వస్తున్నాయి. దీంతో పాటు సుకుమార్‌కు సరిపడ సమయం కావాలి కాబట్టి.. సెంటిమెంట్‌లో భాగంగా పార్ట్ వన్ రిలీజ్ అయిన సరిగ్గా మూడేళ్లకు పార్ట్ 2 రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే.. లాంగ్ వీకెండ్‌ను ప్లాన్ చేస్తు.. డిసెంబర్ 19న పుష్ప2 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి మేకర్స్ రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.