CHANDRA MOHAN: చంద్రమోహన్ ఆఖరి మాటలు ఇవే..

ఇదే పాత్ర చేస్తాం.. ఇవే సినిమాలు చేస్తాం అని గిరిగీసుకొని ఎప్పుడూ కనిపించలేదు ఆయన. హీరో నుంచి విలన్ వరకు.. అన్న పాత్ర నుంచి తాత వరకు.. ప్రతీ పాత్ర చేశారు. ప్రతీ ఒక్కరిని మెప్పించారు. అలాంటి చంద్రమోహన్ ఇక లేరన్న విషయం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 11, 2023 | 02:25 PMLast Updated on: Nov 11, 2023 | 2:25 PM

Tollywood Actor Chandra Mohans Last Words

CHANDRA MOHAN: చంద్రమోహన్ మరణం.. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. మొదటితరంలో మిగిలిన ఏకైన నటుడు చంద్రమోహన్. ఇప్పుడు ఆయన కూడా ఇకలేరు.. కెమెరా ముందు కనిపించరు అనే ఊహే.. ఇండస్ట్రీలో సీనియర్లను కన్నీరు పెట్టిస్తోంది. చంద్రమోహన్‌ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నట శిఖరం ఆయన. పాత్ర ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా.. పాత్రే కనిపించాలి తప్ప, తాను కాదు అనే లెవల్‌లో చంద్రమోహన్ యాక్టింగ్‌ చేసేవారు.

CHANDRA MOHAN: వాళ్లెందుకు సినిమాల్లోకి రాలేదు.. చంద్రమోహన్ పిల్లల గురించి ఈ విషయాలు తెలుసా..?

ఇదే పాత్ర చేస్తాం.. ఇవే సినిమాలు చేస్తాం అని గిరిగీసుకొని ఎప్పుడూ కనిపించలేదు ఆయన. హీరో నుంచి విలన్ వరకు.. అన్న పాత్ర నుంచి తాత వరకు.. ప్రతీ పాత్ర చేశారు. ప్రతీ ఒక్కరిని మెప్పించారు. అలాంటి చంద్రమోహన్ ఇక లేరన్న విషయం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అటు చంద్రమోహన్ ఆఖరి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. దర్శకుడు విశ్వనాథ్‌ చనిపోయినప్పుడు నివాళి అర్పించేందుకు వెళ్లిన చంద్రమోహన్.. చాలా ఏడ్చారు. ఇక తాను ఒక్కడినే మిగిలానంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. సీనియర్ ఆర్టిస్టుల్లో తానొక్కడినే మిగిలానని.. తన ముందు బ్యాచ్ అంతా వెళ్లిపోయిందని.. తన కొలీగ్స్ అయిన కృష్ణ, కృష్ణంరాజు కూడా వెళ్లిపోయారంటూ ఆయన పెట్టుకున్న కన్నీళ్లు.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తున్నాయ్.

ఏమైనా చంద్రమోహన్ ఇక లేరనే వార్తను తెలుగు ఆడియెన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా, విలక్షణ నటుడిగా, ఉత్తమ సహాయనటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. ఎన్నో గొప్ప గొప్ప పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కొన్ని దశాబ్దాల పాటు ఉత్తమ నటుడిగా టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకున్నారు. అలాంటి ఒక ధృవ తార ఇప్పుడు నేలకొరిగింది. తెలుగు చిత్రపరిశ్రమలో ఒక గొప్ప నటుడు ఇకలేరు. టాలీవుడ్‌లో చంద్రమోహన్ స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు అన్నది మాత్రం క్లియర్‌.