Tollywood: శ్రీలీల పాటకు 5 కోట్లు..

శ్రీలీల.. ఈ మూడు పదాలు ఇప్పుడు కుర్రాళ్లు గుండెలను కొల్లగొట్టేస్తున్నాయ్. ధమాకా హిట్ తర్వాత.. ఈ అమ్మడి ఇంటికి అవకాశాలు క్యూ కడుతున్నాయ్. స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఛాన్స్‌లు దక్కించుకుంటూ దూసుకుపోతోందీ బ్యూటీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2023 | 05:00 PMLast Updated on: Apr 01, 2023 | 5:00 PM

Tollywood Actress Srileela In Very Demand

పవన్ కల్యాణ్, విజయ్‌దేవరకొండ, మహేశ్‌బాబు పక్కన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ.. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలోనూ మెరవబోతోంది. కాజల్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న ఈ మూవీలో.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. కథ అంతా.. ఈమె చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో న్యూస్.. ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. శ్రీలీల స్టెప్పులేయబోతున్న ఓ సాంగ్‌ను.. 5కోట్ల ఖర్చుతో షూటింగ్‌ చేస్తున్నారని టాక్.

రామోజీ ఫిల్మ్‌సిటీలో పెద్ద పెట్‌ వేసి.. ఈ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. పండగ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సాంగ్‌లో శ్రీలీల స్టెప్పులకు మతి పోవాల్సిందేనట. ముంబై నుంచి డ్యాన్సర్లు, ఆర్టిస్టులను రప్పిస్తున్నారు. ఈ లెవల్‌లో.. ఒక్క సాంగ్‌ కోసం 5కోట్లు ఖర్చు చేస్తున్నారంటే.. సాంగ్‌కు, కథకు గట్టి లింకే ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ధమాకాలో తన డ్యాన్సింగ్‌ మూవ్స్‌తో క్రేజ్ క్రియేట్ చేసుకున్న శ్రీలీల.. ఈ సాంగ్‌తో మరో సెన్సెషన్‌ క్రియేట్ చేయడం ఖాయం అని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.