Rajinikanth: సీనియర్ హీరోలు మారాల్సిందే.. ఇంకా వాళ్లతో కరెక్ట్ కాదు..?
జైలర్ మూవీలోని నచ్చవయ్యా సాంగ్ సోషల్ మీడియాలో, షాట్స్ లో పేలింది. కాని ఇప్పు డు ఇదే పాట సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురౌతోంది. తాత వయసులో తమన్నాతో రజినీ చిందుల మీద కామెంట్లు పెరిగాయి. ఇదంతా సినిమా అని తెలుసు, గ్లామర్ కోసమే హీరోయిన్లను తీసుకుంటారు కాని, జోడీ అనేది మ్యాటర్ కాదని అందరికీ తెలుసు.. కాని ఎందుకో ఈమధ్య చిరు, బాలయ్య, నాగ్, వెంకీ, రజినీ సరసన మెరిసే హీరోయిన్లు, వాళ్ల వయసే ట్రోలింగ్ కి కారణమౌతోంది.

Tollywood and Kollywood senior heroes are showing interest in acting with young heroines
బాలీవుడ్ హీరోలు కూడా టీనేజర్లతో జోడీ కడ్టడం చూశాం. కాని అది అరదుు.. కాని సౌత్ లో మాత్రం మమ్ముటి, మోహన్ లాల్, కమల్ హాసన్ ని వదిలేస్తే మిగతా సీనియర్ హీరోలంతా పాతిక, ముప్పై ఏల్లు కూడా లేని హీరోయిన్లతో జోడీకట్టే విధానం మారాలనే అభిప్రాయం కామెంట్ల రూపంలో రిఫ్లెక్ట్ అవుతోంది.
జైలర్ పాటలో తమన్నా పక్కన రజినీకాంత్ చిందేస్తుంటే, ఏకంగా తాత అనేస్తున్నారు. జైలర్ కథేంటో, అందులో తమన్నా పాత్రేంటో తెలియకుండా, కామెంట్ చేయటం కరెక్ట్ కాదు కాని, ఓ సినిమాలో హీరో సీనియర్ అయితే హీరోయిన్ చిన్నదైతే ఇలాంటి రియాక్షనే వస్తుంది. కమల్ లా ఏజ్ కి, లుక్కుకి తగ్గ హీరోయిన్ తో జోడీకట్టక, ఇంకెన్నాలు 60 లు 70 లు వచ్చాక కూడా తమన్నాలు, కాజల్ లు అంటూ థర్టీస్ బ్యాచ్ ని పట్టుకుని వేలాడుతారనంటున్నారు. సిక్స్ టీ దాటిన హీరోలు ఇకనైనా జోడీ మార్చకపోతే, సౌత్ సినిమా స్థాయి పెరుగుతున్న టైంలో ఇలాంటి కామెంట్లు మంచివి కావనే వాదన పెరుగుతోంది.