Tollywood: చావుబతుకుల్లో బలగం సింగర్..

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది బలగం సినిమా. ఈ సినిమాలో క్లైమాక్స్‌ సాంగ్‌కు కన్నీరు పెట్టనివాళ్లు దాదాపుగా ఉండరు. సినిమాకు ఆయువుపట్టుగా మారిన ఈ సాంగ్‌.. ప్రేక్షకులను కదిలించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 31, 2023 | 07:30 AMLast Updated on: Mar 31, 2023 | 7:30 AM

Tollywood Balagam Siger In Serious Situation

ఇంత మంచి ఎమోషనల్‌ సాంగ్‌ పాడిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ రియల్‌ లైఫ్‌లో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. అరకొర సంపాదనతో బతుకీడుస్తున్న మొగిలయ్యను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కరోనా సమయంలో ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. అది చాలదన్నట్టు రీసెంట్‌గా బీపీ, షుగర్‌ కూడా వచ్చాయి. వాటి ఎఫెక్ట్‌ ఆయన కళ్లపై పడింది. ప్రస్తుతం ఆయనకు రెండు కళ్లు కనిపించడం లేదు. మొగిలయ్యకు డయాలసిస్‍ చేసేందుకు రక్తం ఎక్కించడానికి అవసరమైన ఆపరేషన్‍ పాయింట్‍ దొరకడం చాలా కష్టమైందంటున్నా డాక్టర్లు.

దీంతో మొగిలయ్య శరీరం మీద దాదాపు 11చోట్ల రంధ్రాలు చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. వేరే దారి లేక ప్రస్తుతం ఆయనకు ఛాతి నుంచి రక్తం ఎక్కిస్తున్నారట. మొగిలయ్య ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న తెలంగాణ హెల్త్‌ మినిస్టర్‌ హరీష్‌ రావు.. ఆ కుటుంబానికి చేయూతనిచ్చారు. ఫ్రీ ట్రీట్‌మెంట్‌ అందించాలంటూ డాక్టర్లకు సూచించారు. రీసెంట్‌గానే డైరెక్టర్‌ వేణు కూడా మొగిలయ్య కుటుంబానికి లక్ష రూపాయలు చెక్‌ ఇచ్చాడు. ఎంతో టాలెంట్‌ ఉన్న కళాకారుడు మొగిలయ్యకు చేతనైనవారు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతున్నారు.