Tollywood: మళ్ళీ బాలయ్య చిరు వార్ తప్పదా..?!

బాలయ్యతో పోటీ చిరంజీవికి కలిసి రావడంతో.. బాలకృష్ణ ఎప్పుడొస్తే.. అప్పుడే వద్దామన్న ఫీలింగ్‌లో చిరంజీవి వున్నాడా? ఇండస్ట్రీలో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. బాలకృష్ణకు పోటీ ఇస్తే... తన సినిమా హిట్‌ అవుతుందన్న నమ్మకాన్నిసంక్రాంతి సీజన్‌ చిరంజీవిలో కలిగించిందా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2023 | 03:30 PMLast Updated on: Mar 27, 2023 | 3:30 PM

Tollywood Churu Balaiah Movie War

చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఒక రోజు గ్యాప్‌లో సంక్రాంతికి వచ్చి రచ్చ చేశాయి. గతంలో ఈ ఇద్దరు చాలాసార్లు పోటీపడినా.. ఈ సంక్రాంతికి వచ్చినంత హైప్‌ గతంలో రాలేదు. ఎవరి సినిమా హిట్‌ అవుతుందా? అని ఎదురుచూస్తే.. ఇద్దరూ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కొట్టారు. అయితే.. వీరసింహారెడ్డి కంటే వాల్తేరు వీరయ్య నిర్మాతకు ఎక్కువ లాభాలు తీసుకొచ్చింది.
సంక్రాంతి రేసులో ఒకేసారి దిగిన చిరంజీవి, బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టారు.

ఆచార్య, గాడ్‌ఫాదర్‌ ఫ్లాపుల్లో వున్న చిరంజీవి అదిరిపోయే హిట్‌ చూశాడు. బాలయ్యతో పోటీ పడడంతో కసిగా హిట్‌ కొట్టామన్న ఫీలింగ్‌లో ఫ్యాన్స్‌ వున్నారట. మరోసారి బాలయ్యతో వస్తే.. మరో హిట్‌ పడుతుందన్నది సెంటిమెంట్‌గా మారిపోయింది. ఈలెక్కన దసరాకు బాలయ్య, చిరు ఫ్యాన్స్‌ మధ్య ఫైట్‌ తప్పేట్టు కనిపించడం లేదు.

బాలకృష్ణ ప్రస్తుతం అనిల్‌రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. చిరంజీవి భోళాశంకర్‌ షూటింగ్‌లో వున్నాడు. ఈ ఇద్దరిలో ఒకరు ఆగస్ట్‌కు వచ్చే అవకాశం వుంది. మోస్ట్‌లీ చాలావరకు షూటింగ్‌ పూర్తిచేసుకున్న భోళాశంకర్‌ రావచ్చు. అయితే ఇదే సీజన్‌కు మహేశ్‌, త్రివిక్రమ్‌ రిలీజ్‌కు ముస్తాబవుతోంది. మహేశ్‌ వస్తే చిరంజీవి తప్పుకుని..దసరాకే వస్తాడట. ఒకవేళ ఈఇద్దరూ సీనియర్స్‌ పండగనే టార్గెట్‌ చేస్తే.. మరోసారి నందమూరి ఫ్యాన్స్‌… మెగా ఫ్యాన్స్‌ మధ్య ఫైట్‌ తప్పదు.