టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ రిపీట్.. పవన్ కోసం రమణ గోగుల
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రమణ గోగుల పాట దుమ్ము రేపింది. చాన్నాళ్ల తర్వాత ఆయన పాడటంతో అభిమానులు ఊగిపోయారు. గోదారి గట్టుమీద అనే పాట ఆ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రమణ గోగుల పాట దుమ్ము రేపింది. చాన్నాళ్ల తర్వాత ఆయన పాడటంతో అభిమానులు ఊగిపోయారు. గోదారి గట్టుమీద అనే పాట ఆ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసింది. రమణ గోగుల వాయిస్ కు క్లాస్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఒకప్పుడు రమణ గోగులకు మంచి క్రేజ్ ఉండేది. అయితే ఆ తర్వాత ఆయన పలు కారణాలతో సంగీతానికి దూరమయ్యారు. ఇక మళ్ళీ సంక్రాంతి వస్తున్నాం సినిమాతో గోదారి గట్టు మీద అనే పాట కోసం రమణ గోగుల కంబ్యాక్ ఇచ్చారు.
ఆయన పాట కారణంగానే సంక్రాంతి వస్తున్నాం సినిమాకు ఆ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరో స్టార్ హీరో కోసం రమణ గోగుల వర్క్ చేయనున్నారు. ఒకప్పుడు రమణ గోగుల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కు పిచ్చ క్రేజ్ ఉండేది. ఆ కాంబోలో వచ్చిన పాటలు ఇప్పటికీ ఏదో ఒకచోట వినపడుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమాకి మరోసారి రమణ గోగుల పని చేస్తే బాగుంటుందని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అది నిజమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టాడు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను ప్లాన్ చేస్తున్న హరీష్ శంకర్.. ఈ సినిమాలో రమణ గోగుల పాటను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ శంకర్ బయటపెట్టాడు. తాను చేస్తున్న సినిమాలో ఒక పాటను రమణ గోగులతో పాడించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ముందుగా ఛాన్స్ ను సంక్రాంతి వస్తున్నాం టీం కొట్టేసిందని చెప్తూ కచ్చితంగా… తాను తన సినిమాలో రమణ గోగుల తో పాట పాడిస్తానని చెప్పుకొచ్చాడు.
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ ఈ కామెంట్స్ చేసాడు. రమణ గోగులతో తాను పనిచేయాల్సి ఉందని.. మా సినిమా లేట్ అవ్వడంతో ముందుగా ఆ చాన్స్ సంక్రాంతికి వస్తున్నాం టీం కొట్టేసింది అని.. అనుకున్నట్టే ఈ చిత్రానికి ఆయన దుమ్ము రేపే సాంగ్ ఇచ్చాడని హరీష్ శంకర్ కామెంట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నారు. జ్వరం నుంచి కోలుకున్న తర్వాత ఆయన డైరెక్ట్ గా హరిహర వీరమల్లు షూటింగ్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ సినిమా మార్చిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం కావడంతో నిర్మాతలపై ఒత్తిడి పెరిగిపోతోంది. మరో మూడు నాలుగు రోజులు షూటింగ్ చేస్తే పవన్ కళ్యాణ్ పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వటం కుదరడం లేదు. ఎలాగైనా సరే త్వరలో పవన్ కళ్యాణ్ డేట్ ఇవ్వాలని నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో కూడా స్పీడ్ గానే ఉన్నారు మేకర్స్.
embed]https://www.youtube.com/watch?v=sY8x36toZTs[/embed]