Tollywood Heroines 2023: కొత్త హీరోయిన్స్ ఎక్కడ?

తెలుగులో స్టార్ హీరోయిన్స్ కొరతను ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. కొత్తగా చాలామంది పరిచయం అవుతున్నా.. ఎవరూ క్లిక్ కావడం లేదు. ఈ ఏడాది ఇబ్బడి ముబ్బడిగా కొత్త అందాలు పరిచయమైనా... ఫేడౌట్‌ అయిన భామలే ఎక్కువ. 

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2023 | 05:53 PMLast Updated on: Dec 30, 2023 | 5:53 PM

Tollywood Debut Heroines 2023

Tollywood Debut Actress 2023:  27 ఏళ్ల ఆషిక 20 ఏళ్ల వయసులో వెండి తెరకు పరిచయమైంది. ఈ ఏడాది అమిగోస్‌ మూవీతో ఎంట్రీ ఇచ్చినా… కేవలం  రీమిక్స్‌ సాంగ్‌తో అందరి దృష్టిలో పడింది. డెబ్యూ మూవీ ఫ్లాప్‌ కావడంతో మరో ఆఫర్‌ రావడం కాస్త లేటైనా.. నాగార్జున  ‘నా సామిరంగ’తో మరో ఆఫర్‌ కొట్టేసింది. నా సామిరంగ టీజర్‌ చూస్తుంటే.. హీరో  కథంతా హీరోయిన్‌ చుట్టూ తిరుగుతోందనిపిస్తోంది. ఈ మూవీతో స్టార్‌ ఇమేజ్‌ దక్కుతుందన్న ఆశతో వుంది ఆషికా రంగనాథ్. 2023 కలిసిరాకపోయినా.. 2024 సంక్రాంతి స్టార్‌ను చేస్తుందేమో చూడాలి మరి.

మోడల్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన సాక్షి.. ఇన్‌స్టాలో యాక్టీవ్‌గా ఉంటూ.. ఏజెంట్‌తో వెండితెరకు పరిచయమైంది. డెబ్యూ మూవీ రిలీజ్‌ కాకుండానే..వరుణ్‌తేజ్‌ గాండీవధార అర్జున ఛాన్స్‌ అందుకుంది.  అయితే రెండూ సినిమాలు డిజాస్టర్స్‌ కావడంతో క్రేజ్‌ దక్కలేదు. అయినా ఈ అమ్మడి రాత.. గీత బాగుందనుకుంటా.. పవన్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో సెకండ్‌ హీరోయిన్‌ ఛాన్స్‌ అందుకుంది సాక్షి.

కృతిసనన్‌ చెల్లెలు నుపూర్‌ సనన్‌ టైగర్‌ నాగేశ్వరరావుతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీ ఫ్లాప్‌ కావడంతో మరో ఆఫర్‌ దక్కలేదు.  కృతిసనన్‌ గ్లామర్‌ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంటే… చెల్లెల్లు సింగర్‌గా పాపులరై యాక్టింగ్‌ స్టార్ట్‌ చేసి ఒక సినిమా హీరోయిన్‌గా మిగిలిపోయింది. ఇదే సినిమాతో పరిచయమైన మరో హీరోయిన్‌ గాయత్రి భరద్వాజ్‌ కూడా తర్వాత కనిపించలేదు.

హర్యానాలో పుట్టిన యుక్తా తరేజ ‘రంగబలి’తో వెండితెరకు ఇంట్రడ్యూస్‌  అయింది.  మోడల్‌గా ఎదిగిన యుక్తా ఇమ్రాన్‌ హష్మీతో కలిసి నటించిన ‘లూట్‌ లగే’   మ్యూజికల్‌ వీడియోకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కానీ.. హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేక ఒక సినిమాతో సరిపెట్టుకుంది.

తేజ హీరోయిన్‌ గా పరిచయం చేశారంటే.. క్రేజ్‌ వస్తుంది. కానీ.. అహింసతో ఎంట్రీ ఇచ్చిన గీతికా తివారి పేరు మళ్ళీ వినిపించలేదు. ప్రేమ పావురాలు ఫేం భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసాని… నేను స్టూడెంట్‌ సార్‌తో హీరోయిన్‌గా పరిచయమైన సంగతే తెలియలేదు. ఈ ఏడాది పరిచయమైన హీరోయిన్స్‌లో రెబ మౌనిక జాన్‌ సక్సెస్‌ చూసింది. శ్రీవిష్ణుతో జత కట్టిన ‘సామజ వర గమన’తో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనిపించుకున్నా ఆ రేంజ్‌లో ఆఫర్స్‌ దక్కలేదు.

వీళ్లే కాకుండా.. చిన్న సినిమాలతో చాలామంది కొత్త అందాలు పరిచయమైనా.. ఎవరూ క్లిక్‌ కాలేదు. సినిమాలు ఫ్లాప్‌ కావడం మెయిన్‌ రీజన్‌ అయితే.. కొత్త అందాలు ఆకట్టుకోలేకపోయాయి. కొద్దో గొప్పో… అమిగోస్‌ భామ ఆషిక రంగనాథ్ మాత్రమే పెద్ద హీరో నాగార్జునతో జత కట్టే ఛాన్స్‌ కొట్టేసింది.