Peda Kapu 1: టాలీవుడ్‌లో ఈ వీక్ అంతా షాకులేనా..?
చంద్రముఖి 2లో కంగనా కంగారు, కథలో భయపెట్టే సీన్లు సుమారు అనేలా ఉండటంతో రెండు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. కనీసం ఫ్రైడే అయినా బేజా ఫ్రై చేయని సినిమా వస్తే బాగుండనుకుంటే, ఈ సారి బ్రహ్మోత్సవం మించిన బాక్సాఫీస్ ఉత్సవం మనముందుకు తెచ్చాడు శ్రీకాంత్ అడ్డాల.
Peda Kapu 1: ఈ వారం నిజంగా సినిమా లవర్స్‌కు పెద్ద షాకే. గురువారం వచ్చిన మూవీ స్కంద. అసలందులో కథ ఉందా అనే డౌట్ వచ్చేలా చేసింది. చంద్రముఖి 2లో కంగనా కంగారు, కథలో భయపెట్టే సీన్లు సుమారు అనేలా ఉండటంతో రెండు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. కనీసం ఫ్రైడే అయినా బేజా ఫ్రై చేయని సినిమా వస్తే బాగుండనుకుంటే, ఈ సారి బ్రహ్మోత్సవం మించిన బాక్సాఫీస్ ఉత్సవం మనముందుకు తెచ్చాడు శ్రీకాంత్ అడ్డాల.
పెద కాపు రెండు భాగాలుగా తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల.. నారప్పతో రాని పేరు ఈ మూవీతో వస్తుందనుకున్నాడు. కాని తన మూవీలో డైలాగ్స్ అర్ధకావటం ఎంత కష్టమో, కథని, సీన్లో డెప్త్‌ని అర్ధం చేసుకోవటం అంతే కష్టం. నిజంగా అంత కష్టపడి పెద కాపుని తీస్తే ఆడియన్స్‌కి అది అర్ధం కాక.. సగం సినిమా వ్యర్ధమైందంటున్నారు. చెప్పాలనుకున్న కథని ముందుకి, వెనక్కి లాగుతూ, పొలిటికల్ డ్రామాకి విలేజ్ డ్రామా యాడ్ చేసి, హైడ్రామాగా మార్చటమే ఈ సినిమాకు పెద్ద మైనెస్ అయ్యింది. ఇక కథేంటి, మ్యూజిక్ ఎలా ఉంది, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ ఇవన్నీ చర్చించటం వృథా అంటున్నారు ఆడియెన్స్. అంత కన్ఫ్యూజన్ ఈ డ్రామా క్రియేట్ చేస్తే.. ది వ్యాక్సిన్ వార్.. నిజంగా ఆడియన్స్ ఎమోషన్స్ మీద వార్ చేస్తోంది. అతి ప్రాపగండాతో కావాలని తీసినట్టు ఎమోషన్స్ ఉన్నాయనంటున్నారు.
నిజంగానే మనం సొంత వ్యాక్సిన్ రెడీ చేసుకునే టైంలో విదేశీ మూకలు కామెంట్లు చేశాయి. స్వదేశంలో కొంత దేశద్రోహుల్లా కొందరి కామెంట్లు వినిపించాయి. వాళ్లే టార్గెట్ గా సినిమా తీసినట్టు ఉండటంతో, అసలు కథ దారి తప్పిందంటున్నారు. ఏదేమైనా దేశభక్తిని టార్గెట్ చేసి వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసే బ్యాచ్‌లో ఈ దర్శకుడు వస్తాడో రాడో కాని, ఈ మూవీ మాత్రం ఆ లిస్ట్‌లో పడేలా ఉందనే కామెంట్స్ పెరిగాయి.