Tollywood Directors: డైరెక్టర్ల నయా ట్రెండ్.. 100 డేస్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న దర్శకులు..
ఇప్పుడు ఆల్‌మోస్ట్ మేకర్స్ అంతా టాలీవుడ్‌లో టార్గెట్ హండ్రెడ్ డేస్ రూల్‌ను ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తోంది. ప్రస్తుతం నడుస్తోన్న షూటింగ్‌ల ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి బడా డైరెక్టర్లు మాత్రమే తమ సినిమాలకు రెండు మూడేళ్లు టైమ్ తీసుకుంటున్నారు.
Tollywood Directors: టాలీవుడ్ డైరెక్టర్లు నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. హండ్రెడ్ డేస్ టార్గెట్‌గా షూటింగ్‌లు కంప్లీట్ చేస్తున్నారు. అత్యంత వేగంగా భారీ సినిమా షూటింగ్‌లు పూర్తి చేయగల దర్శకుల్లో ఇండియాలోనే ఇద్దరు డైరెక్టర్లు ఫస్ట్ టూ పొజిషన్లను ఆక్యూపై చేస్తారు. వాళ్లే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. వీళ్లని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారే ఏమో తెలియదు కానీ.. ఇప్పుడు ఆల్‌మోస్ట్ మేకర్స్ అంతా టాలీవుడ్‌లో టార్గెట్ హండ్రెడ్ డేస్ రూల్‌ను ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తోంది.
Allu Arjun: తెలుగు హీరోల మైనపు బొమ్మలే ఎందుకు పెట్టారు..?
ప్రస్తుతం నడుస్తోన్న షూటింగ్‌ల ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి బడా డైరెక్టర్లు మాత్రమే తమ సినిమాలకు రెండు మూడేళ్లు టైమ్ తీసుకుంటున్నారు. ఇక ఈ విషయంలో జక్కన్నది సెపరేట్ స్టైల్. అవసరం అయితే.. తన సినిమాకు జక్కన్న ఐదేళ్ల సమయం కూడా తీసుకుంటాడు. వీళ్ల సినిమాల రేంజ్, స్పాన్, స్టైల్.. ఆ లెక్కలన్నీ వేరు కాబట్టి ఎన్నేళ్లు సెట్స్‌లో ఉన్నా చెల్లుతుంది. కానీ.. మిగతా సినిమాలకు అంత స్కోప్ ఉండదు. కాబట్టి.. వీలైనంత వేగగా సినిమా షూటింగ్స్ చుట్టేయడానికి అవకాశం ఉండటంతో మేకర్స్ ఆ ఛాన్స్ తీసుకుంటున్నారు. భీమ్లానాయక్’, ‘బ్రో’, ‘వకీల్ సాబ్’ లాంటి చిత్రాలు 100 రోజుల్లోపే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అంతకు ముందు ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళాశంకర్’, ‘గాడ్ ఫాదర్’ లాంటి సినిమాలు కూడా ఇదే రూల్ ఫాలో అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న మరికొన్ని చిత్రాలూ అదే వేలో వెళ్లిపోతున్నాయి. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్‌ను 75 రోజుల్లోనే పూర్తి చేయాలన్నది ప్లాన్ అట.
అలాగే.. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ కూడా 100 రోజులు టార్గెట్‌గానే సెట్స్‌కి వెళ్లింది. అలాగే విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ కూడా 100 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. సంక్రాతికి రిలీజ్ అయిన నాగార్జున ‘నాసామి రంగ’ అయితే ఏకంగా 50 రోజుల్లోనే షూట్ పూర్తిచేసుకుంది. ఇలా చేయడం వల్ల నిర్మాతలకు నిర్మాణ భారం చాలా వరకూ తగ్గుతుందన్నది ఇండస్ట్రీ టాక్. మొత్తానికి ఏది ఏమైనా డైరెక్టర్లు ఫాలో అవుతున్న ఈ నయా ట్రెండ్ టాలీవుడ్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది.