1000 కోట్ల బంగారు డైనోసార్.. పాన్ ఇండియా కింగ్ తో గేమ్స్ ..?
పాన్ ఇండియా లెవల్లో బంగారు బాతులంటే ఒకటి రెబల్ స్టార్, రెండు మ్యాన్ ఆఫ్ మాసెస్, మూడు ఐకాన్ స్టార్... అది కూడా పుష్ప2 అఫీషియల్ వసూళ్ల మీద వస్తున్న కామెంట్లను పక్కన పెడితేనే.. ఐతే ఈ డిస్కర్షన్ కి కారణం, వెయ్యికోట్లు లేదంటే పాన్ ఇండియా హిట్లకు కారణమయ్యే హీరోల క్రేజ్ ని పిండేసుకుంటే పర్లేదు
పాన్ ఇండియా లెవల్లో బంగారు బాతులంటే ఒకటి రెబల్ స్టార్, రెండు మ్యాన్ ఆఫ్ మాసెస్, మూడు ఐకాన్ స్టార్… అది కూడా పుష్ప2 అఫీషియల్ వసూళ్ల మీద వస్తున్న కామెంట్లను పక్కన పెడితేనే.. ఐతే ఈ డిస్కర్షన్ కి కారణం, వెయ్యికోట్లు లేదంటే పాన్ ఇండియా హిట్లకు కారణమయ్యే హీరోల క్రేజ్ ని పిండేసుకుంటే పర్లేదు కాని, వాళ్ల పీక పిసికేసే ప్రయత్నం మీదే ఘాటైన కామెంట్లు పెరిగాయి. బంగారు గుడ్డు పెడుతోందని బాతుని కోసేస్తే, గుడ్డు ఉండదు బాతు మిగలదు… ఈ సామెత ఇప్పుడే వాడటానికి రీజన్, దారి తప్పుతున్న పాన్ ఇండియా డైరెక్టర్ల విజన్.. రెబల్ స్టార్ ఎంతగా డైరెక్టర్స్ ని నమ్మితే ఏదైనా చేయటానికి సిద్ధపడతాడని, తనతో అవసరం లేని రిస్క్ లు చేయిస్తున్నారు… రియాలిటీ పిచ్చితో రిస్క్ లోకి రెబల్ స్టార్ కెరీర్ ని నెట్టేస్తున్నారు.. ఇంతకి ఏం జరిగింది? ఎందుకు రెబల్ స్టార్ తో దర్శకులు గేమ్స్ ఆడుతున్నారన్న కామెంట్లు పెరిగాయి?
రెబల్ స్టార్ ప్రభాస్ కి ఫౌజీ సెట్లో గాయాలయ్యాయన్న వార్తలొచ్చాక ఫ్యాన్స్ లో కంగారుపెరగొచ్చుకాని, ఇప్పుడు అదే ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కి కూడా కంగారుకంటే కోపం పెరిగిపోతోంది. దర్శకుల అతి వల్ల రెబల్ స్టార్ కెరీర్ రిస్క్ లో పడేస్తున్నారా అంటూ ఓ భారీ చర్చ షురూ అయ్యింది
ఫౌజీ మూవీ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో లో ఓ ఇండియన్ సోల్జర్ లవ్ స్టోరీని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడీ. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. సీతారామం చూసిన జనానికి మళ్లి అలాంటి లేదంటే అంతకంటే గొప్ప ప్రయత్నం ప్రభాస్ తో చేస్తే సంతోషమే.. కాని అసలు సమస్య, డైరెక్టర్ గా సీతారామం మూవీతో పేరొచ్చింది, రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రయోగం చేసే ఛాన్స్ దొరికింది..
అంతే ఇక తగ్గదేలేదన్నట్టు, ఫౌజీమూవీని రియల్ లొకేషన్స్ తో షూట్ చేసే పని చేశాడు హను రాఘవపూడి. అదే కొంపముంచే నిర్ణయం అంటున్నారు. దానికి కారణం కలకత్తాలోని కొండప్రాంతాలు, నదీ లోయల్లో కొన్ని సీన్లు తీయాలనుకున్నారట. ఆవిషయంలో ఓ సీన్ తీసే ప్రాసెస్ లో ప్రభాస్ యాంకీల్ కి గాయాలయ్యాయి. చీలమండలం కి గాయాలవ్వటంతో జపాన్ లో కల్కీ రిలీజ్ ప్రమోషన్ కి తాను వెల్లటమే కాదు, ఫౌజీ షూటింగ్ కూడా క్యాన్సిల్ అయ్యింది
మళ్లీ జనవరి వరకు ప్రభాస్ రెస్ట్ తీసుకుంటాడట. ఆతర్వాతే దీ రాజా సాబ్ పెండింగ్ షూటింగ్, తో పాటు ఫౌజీ షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఎంతగా ప్రభాస్ దర్శకుల మాట వింటాడని, నమ్మితే ఎంతదూరమైనా వెళతాడని, ఇలా తనతో అనవసరపు రిస్క్ లు చేయించటం నిజంగా వ్రుధా ప్రయాసే…
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ ఇండిపెండెన్స్ ని తలపించే సెట్ వేశారు. అక్కడే చాలా సీన్లు ప్లాన్ చేశారు. అలాంటిది సడన్ గా ఎందుకిలా రియల్ లొకేషన్స్ లో అది కూడా కొండలు గుట్టలు, లోయల్లో షూటింగ్ అంటే అక్కడ ఏమాత్రం హీరోకి ఇబ్బంది ఎదురైనా తన కెరీర్ కి నష్టం… తన మూవీల షూటింగ్ ఆగిపోతే వేల కోట్ల బిజినెస్ డ్యామేజ్ అవుతుంది.
ఏదేమైనా ఫౌజీ లో యాక్సిడెంట్ వల్ల ప్రభాస్ ప్రస్థుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఇది రెబల్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టే న్యూసే అయినా, ది రాజా సాబ్ తాలూకు టీజర్ క్రిస్మస్ కి రాబోతుండటం మాత్రం కొంతవరకు గుడ్ న్యూసే…