టాలీవుడ్ “గుండు” మొక్కు, తిరుమల మొక్కు ఉంటే మూవీ బ్లాక్ బస్టర్ అంతే
ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము రేపుతున్నారు. ఒక్కో సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్నారు. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకోవడమే కాదు... తమ సత్తా ఏంటీ అనేది వరల్డ్ సినిమాలో కూడా చూపించడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము రేపుతున్నారు. ఒక్కో సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్నారు. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకోవడమే కాదు… తమ సత్తా ఏంటీ అనేది వరల్డ్ సినిమాలో కూడా చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు తెలుగులో వచ్చే సినిమాలు… భారీ బడ్జెట్ తో వస్తున్నా తక్కువ బడ్జెట్ తో వస్తున్నా బాలీవుడ్ లో మాత్రం భయం కామన్ అయిపోయింది. ఇక ఇతర భాషల హీరోలు కూడా మన తెలుగులో సినిమాలకు రెడీ అవుతున్నారు.
మలయాళ స్టార్ హీరో… దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగు హీరో అయిపోయాడు. తెలుగులో అతను చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మహానటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టి… ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో టాలీవుడ్ హీరో అనే ఇమేజ్ తెచ్చేసుకున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా తెలుగులో సినిమా కోసం ట్రై చేస్తున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో విలన్ గా ఓ వెలుగు వెలుగుతున్న బాబీ డియోల్ తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్ లు ఓ సెంటిమెంట్ ను దారుణంగా ఫాలో అవుతున్నారు. సినిమా హిట్ అయితే చాలు తిరుపతి వస్తామని మొక్కుకుంటున్నారు. అలా ముగ్గురు డైరెక్టర్ లు తిరుమల వెళ్తామని మొక్కుకుని సినిమా హిట్ అయితే గుండు కొట్టించుకున్నారు. యానిమల్ సినిమా హిట్ అయితే… తిరుమల వెళ్తాను అని మొక్కుకున్న… సందీప్ రెడ్డి వంగా… సినిమా హిట్ కాగానే వెళ్లి తల నీలాలు సమర్పించారు. ఆ సినిమా సందీప్ రేంజ్ ను ఎక్కడికో తీసుకు వెళ్ళింది. ఇప్పుడు స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.
ఇక కల్కీ సినిమా విషయంలో కూడా నాగ్ అశ్విన్ ఇలాగే మొక్కుకుని… తిరుమల వెళ్లి శ్రీవారికి మొక్కు చెల్లించాడు. కల్కీ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో బాలీవుడ్ జనాలను ఏ రేంజ్ లో కంగారు పెట్టిందో తెలిసిందే. ఇక లక్కీ భాస్కర్ సినిమా హిట్ అయితే తిరుమల వెళ్తాను అని మొక్కుకున్న వెంకీ అట్లూరి కూడా తిరుమల వెళ్లి మొక్కు చెల్లించారు. ఆ సినిమా దుల్కార్ సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివ కూడా తిరుమల వెళ్ళారు. సినిమా హిట్ అని ధీమాగా చెప్పి హిట్ కొట్టాడు.