Tollywood: తెలుగు సినిమాని కాపాడుతున్న బాలీవుడ్..
రూ.600 కోట్లు పెట్టి తీసిన మూవీతో పోలిస్తే రూ.25 కోట్లు పెట్టిన హనుమాన్ ఔట్‌పుట్ షాక్ ఇచ్చింది. కాబట్టే హనుమాన్ రూ.350 కోట్లపైనే వసూలు చేసింది. అసలు ఆదిపురుషే రాకపోయుంటే, అప్పుడు కూడా హనుమాన్ హిట్టయ్యేదనుకోండి.
Tollywood: ఒక చిన్న గీత పెద్దగా కనిపించాలంటే, అంతకంటే చిన్న గీత పక్కన గీయాలి. అదే టాలీవుడ్ మూవీలకు జరుగుతోంది. మన సినిమా బాగుందనే మాట నార్త్ ఇండియన్స్‌కి అర్ధం కావాలంటే, వాళ్ల హిందీ సినిమాతో పోలిస్తే మన మూవీ మతిపోగొట్టేలా ఉందనిపించాలి. అలా అనిపించడంవల్లే హనుమాన్‌ని ఆదిపురుష్ కంటే కూడా అదరహో అన్నారు. నిజమే.. రూ.600 కోట్లు పెట్టి తీసిన మూవీతో పోలిస్తే రూ.25 కోట్లు పెట్టిన హనుమాన్ ఔట్‌పుట్ షాక్ ఇచ్చింది.
MEGASTAR CHIRANJEEVI: విశ్వంభరలో.. మెగాస్టార్ ఒక్కడే కాదు..
కాబట్టే హనుమాన్ రూ.350 కోట్లపైనే వసూలు చేసింది. అసలు ఆదిపురుషే రాకపోయుంటే, అప్పుడు కూడా హనుమాన్ హిట్టయ్యేదనుకోండి. కాని ఈ సినిమాకు ఆదిపురుష్‌తో పోల్చి చూడటం వల్ల వచ్చిన ప్రమోషన్ మాత్రం రాకపోయేది. అంతెందుకు.. ఫైటర్ మూవీతో ఆపరేషన్ వాలెంటైన్‌ని పోల్చారు కాబట్టే, ఆ ఔట్‌పుట్ కంటే ఇదే బెటర్ అని ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ చూసిన నార్త్ ఆడియన్స్ అన్నారు. ఇలా అటు అదిపురుష్, ఇటు ఫైటర్ మూవీలు తెలుగు సినిమాలను కాపాడుతున్నాయి. హనుమాన్, ఆపరేషన్ వాలంటైనే కాదు, గామి మూవీ ట్రైలర్ రాగానే ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ని ట్రోల్ చేస్తున్నారు. హాలీవుడ్ మూవీ ఇంటర్‌స్టెల్లార్ రేంజ్ సీన్లతో గామీ మూవీ ఔట్‌పుట్ క్వాలిటీ షాక్ ఇస్తోంది.
కానీ, ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ రూ.600 కోట్లతో ఏం చేశాడనే ప్రశ్న నార్త్ ఇండియన్స్ వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓం రౌత్‌ని మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. ఇలా చూస్తే ఆదిపురుష్, ఫైటర్ లాంటి వరస్ట్ క్వాలిటీ మూవీస్ రాకపోతే, తెలుగు సినిమా గొప్పతనం నార్త్ బ్యాచ్‌కి అర్ధం అయ్యేది కాదు అని అనుకోవాల్సి వస్తోంది.