Mamitha Baiju: మూడు మెరుపుతీగలకు టాలీవుడ్ ఫిదా.. వరుస ఆఫర్లు..!
ఆల్రెడీ రవితేజ, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమాల్లో ఈ హీరోయిన్‌కే ఆఫర్ల కబురు వెళ్లిందట. ఒక వైపు బాలీవుడ్ నుంచి యానిమల్ ఫేం తృప్తీ దిమ్రీకి తెలుగు ఆఫర్లు వస్తుంటే, మరో వైపు ఇద్దరు మలయాళ ముద్దుగుమ్మలు మమితా బైజూ, అనశ్వర రాజన్‌కి ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి.

Mamitha Baiju: ప్రేమలు ఫేం మమితా బైజూ దండయాత్రకే టాలీవుడ్, కోలీవుడ్ కూడా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలా షేక్ అవుతోంది. ఆల్రెడీ రవితేజ, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమాల్లో ఈ హీరోయిన్‌కే ఆఫర్ల కబురు వెళ్లిందట. ఒక వైపు బాలీవుడ్ నుంచి యానిమల్ ఫేం తృప్తీ దిమ్రీకి తెలుగు ఆఫర్లు వస్తుంటే, మరో వైపు ఇద్దరు మలయాళ ముద్దుగుమ్మలు మమితా బైజూ, అనశ్వర రాజన్‌కి ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి.
Naga Chaitanya: చైతూ, శోభితా డేటింగ్ ! ఇలా దొరికిపోయారేంటి..
మోహన్ లాల్ మూవీ నేరులో పెర్పామెన్స్‌తో ఆకట్టుకున్న అనశ్వరకి.. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కన్ఫామ్ అయ్యిందట. ఇక రామ్, శర్వానంద్ సినిమాల్లో కూడా తనకి ఆఫర్ ఉందని తెలుస్తోంది. ఇక కన్నడ మూవీ సప్తసాగరాలు దాటి ఫేం రుక్మిణి వసంత్‌కి కాంతారా ప్రీక్వెల్‌తోపాటు రానా సినిమాలో ఛాన్స్ దక్కింది. సూర్య సినిమాతో పాటు నితిన్ సినిమాలో కూడా ఛాన్స్ దొరికిందట. కేవలం ఒకటీ.. రెండు హిట్లతో టాలీవుడ్, కోలీవుడ్‌లో ఆఫర్లకు ఎసరు పెట్టేస్తున్నారు ముగ్గురు ముద్దుగుమ్మలు.
రుక్మిణీ, అనశ్వర, మమిత.. ఈ ముగ్గురి ట్రెండే నడుస్తోందిప్పుడు. సోషల్ మీడియాలో వీళ్లకున్న ఫాలోయింగ్, తెలుగు, తమిళ కుర్రాళ్లలో వీల్లకున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు.