Trivikram Srinivas: పవన్ కటౌట్ పెట్టుకుని కోట్లు దోపిడి.. రిచ్ డైరెక్టర్ తెలివి..
త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో మూవీ తీసి 3 ఏళ్లు దాటింది. ఇంతవరకు మరో మూవీ తీయలేదు. గుంటూరు కారం కనీసం కొత్త షెడ్యూల్ కూడా ఇంకా పట్టాలెక్కలేదు. కాని ఏడాదికి 120 కోట్ల చొప్పున, ఇప్పటికే మూడేళ్లలో 300 కోట్ల పైనే సంపాదించాడు. అంతా పవన్ కళ్యాణ్ దయా, పుణ్యమే.
చేతిలో పవన్ కళ్యాణ్ కెరీర్ ఉంది. పవన్ కూడా గుడ్డిగా నమ్మి తన గురువుగా భావించిన త్రివిక్రమ్ కే తన కెరీర్ సంబంధించిన పెత్తనం అప్ప,చెప్పడు. దీంతో పవన్ సినిమాలను డీల్ చేస్తూ కోట్లు వెనకేసుకుంటున్న త్రివిక్రమ్ అంటున్నారు. భీమ్లానాయక్ కి రైటర్ గా వర్క్ చేసి, డీల్ సెట్ చేస్తే 30 కోట్లు, వసూళ్లలో ప్రాఫిట్లు. ఇక సుజీత్ ఓజీ తోపాటు, బ్రో సినిమాలకు త్రివిక్రమ్ షేర్ తీసుకుంటున్నాడు.
ఇలా లెక్కేస్తే పవన్ పేరు చెప్పుకునే ఇప్పటికీ 300 కోట్ల వెనసుకున్నాడట త్రివిక్రమ్. అలా పవన్ డేట్లతో కోట్లు పట్టేస్తున్న త్రివిక్రమ్, ఈవిషయంలో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళినే మించాడు. తను 3 ఏళ్లు కష్టపడి ఓ మూవీ తీస్తే 50 నుంచి 120 కోట్లే సంపాదిస్తున్నాడు. ఒక్క మూవీకి 120 కోట్లు అది మూడేళ్లు కష్టపడితే, అంటే ఏడాదికి 40 కోట్లు.. అదే త్రివిక్రమ్ తో పోలిస్తే 120 కోట్లు.. సో మూడు రెట్ల వ్యత్యాసం ఉంది. పవన్ వల్ల సినిమాలు తీయకుండానే, త్రివిక్రమ్ కి కోట్లు వచ్చేస్తుంటే, ఇక మహేశ్ మూవీనో మరో సినిమా మీదనో ఇక అంతగా ధ్యాస ఎందుకుంటుంది.. ఇవి ఇండస్ట్రీలో పేలుతున్న కామెంట్లు.