TOLLYWOOD: టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్స్ ఎక్కువయ్యాయా..? ఎందుకీ దొంగ లెక్కలు..

పెద్ద సినిమాల విషయంలో ఈ కాకి లెక్కలు, దొంగ లెక్కలకు హద్దే లేకుండా పోతుంది. ఆ హీరో, ఈ హీరో అన్న తేడా లేకుండా దాదాపుగా అందరు పెద్ద హీరోల సినిమాలకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సినిమాలకు వచ్చిన నిజమైన కలెక్షన్లు కాకుండా నిర్మాతలు గొప్పలకు పోతూ, కలెక్షన్లను భారీగా పెంచి చూపిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 17, 2024 | 04:54 PMLast Updated on: Jan 17, 2024 | 4:54 PM

Tollywood Film Makers Creating Fake Collections For Their Moives

TOLLYWOOD: ఈ మధ్య కాలంలో సినిమాల కలెక్షన్ల విషయంలో దొంగ లెక్కలు ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు మా చిత్రం ఇంత వసూలు చేసింది.. ఇన్ని సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకుంది.. ఇన్ని సెంటర్లలో అర్దశతదినోత్సవం జరుపుకుంది.. అని నిర్మాతలే దొంగ కలెక్షన్లు, సెంటర్స్‌ చూపిస్తూ, ప్రకటనలు ఇచ్చేవారు. వాటిని చూసిన ఫ్యాన్స్ మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అంటూ రెచ్చిపోయేవారు. అయితే కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రకటనలు కాకుండా ఏకంగా మీడియా సమావేశాలే పెట్టి తమ చిత్రాల కలెక్షన్లపై మేకర్స్ దొంగ లెక్కలు చెబుతున్నారు. మరోపక్క వచ్చిన ఆదాయం కంటే ఎగ్జిబిటర్లు కలెక్షన్లను తక్కువగా చూపుతుంటే ఆయా చిత్రాల నిర్మాతలు మాత్రం తమ చిత్రాల కలెక్షన్లను పెంచి చెబుతున్నారు.

RC16పై మెగా ఫ్యాన్స్ టెన్షన్.. అంత తొందరేమొచ్చిందని గగ్గోలు

దీంతో అభిమానులు కొట్లాటలకు దిగుతున్నారు. కానీ వీటిని వారి అభిమానులు నమ్మవచ్చేమోగానీ సినిమా పరిజ్ఞానం, కాస్త వివేకంతో ఆలోచించే వారెవ్వరూ నమ్మడం లేదు. పైగా ఇలాంటి దొంగ లెక్కలతో హీరోల రెప్యుటేషన్ దెబ్బ తీస్తున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో ఈ కాకి లెక్కలు, దొంగ లెక్కలకు హద్దే లేకుండా పోతుంది. ఆ హీరో, ఈ హీరో అన్న తేడా లేకుండా దాదాపుగా అందరు పెద్ద హీరోల సినిమాలకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సినిమాలకు వచ్చిన నిజమైన కలెక్షన్లు కాకుండా నిర్మాతలు గొప్పలకు పోతూ, కలెక్షన్లను భారీగా పెంచి చూపిస్తున్నారు. నిన్న సలార్, నేడు గుంటూరు కారం సినిమా విషయంలో ఇదే జరగడం మరోసారి హాట్‌టాపిక్ అయ్యింది. గుంటూరు కారం మూవీకి మొదటి షో నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్‌ల వైపు రప్పించడానికి చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రకటిస్తున్న అధికారిక కలెక్షన్స్‌ నమ్మలేని విధంగా ఉన్నాయని డైహార్డ్‌ ఫ్యాన్సే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఇటీవల ప్రభాస్ సలార్‌ మూవీకి కూడా అదే జరిగింది. ఆదిపురుష్‌ విషయంలోనూ అదే జరిగింది. సలార్ ప్రపంచవ్యాప్త దాదాపు 600Cr రాబట్టింది. అయితే దాన్ని 800Cr కలెక్షన్లు రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. గుంటూరు కారంలో కూడా అదే జరుగుతోంది.

టాక్, రేటింగ్స్ కోసం ఈ చిత్రం బాక్స్ వద్ద అంచనాలకు మించి మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికీ, మేకర్స్ సంఖ్యలను హైప్ చేస్తున్నారు. సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నప్పుడు ఇలా చేయాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదు. బాక్సాఫీస్ సంఖ్యలను తారుమారు చేయడం ద్వారా హీరో ప్రతిష్టను దెబ్బతీయడం కొత్త ట్రెండ్‌గా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కలెక్షన్స్ ఎంత వస్తే.. అంతే ఎందుకు చెప్పడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హీరోలు ఈ విషయాన్ని గ్రహించి బాక్సాఫీస్ లెక్కలు పెంచడాన్ని ఆపాలని అనలిస్టులు చెబుతున్నారు. లేకుంటే ఈ జాడ్యం మరింత పాతుకుపోయి హీరోల రెప్యుటేషన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంంని హెచ్చరిస్తున్నారు.