నువ్వెంత.. నీ బతకెంత.. ప్రభాస్‌నే అనే స్థాయా నీది..

ప్రభాస్.. బాహుబలి, సలార్‌... లేటెస్ట్ కల్కి తర్వాత పాన్‌ వాల్డ్‌ స్టార్ అయిపోయాడు. ప్రభాస్ పేరు చెప్పినా.. ప్రభాస్‌ వాళ్ల పేరు చెప్పినా.. ఆ మూవీ దశ తిరిగిపోయినట్లే. ఆ రేంజ్ వచ్చేసింది ప్రభాస్‌కు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 21, 2024 | 06:45 PMLast Updated on: Aug 21, 2024 | 6:45 PM

Tollywood Fires On Arshad Varsi

ప్రభాస్.. బాహుబలి, సలార్‌… లేటెస్ట్ కల్కి తర్వాత పాన్‌ వాల్డ్‌ స్టార్ అయిపోయాడు. ప్రభాస్ పేరు చెప్పినా.. ప్రభాస్‌ వాళ్ల పేరు చెప్పినా.. ఆ మూవీ దశ తిరిగిపోయినట్లే. ఆ రేంజ్ వచ్చేసింది ప్రభాస్‌కు. బాలీవుడ్ అయితే డార్లింగ్‌ పేరుకే పడిపోతోంది. ఇంత క్రేజ్ ఉన్న ప్రభాస్‌ మీద.. అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పిస్తున్నాయ్. నువ్వెంత.. నీ బతుకెంత.. నీ యాక్టింగ్ ఎంత.. మార్కెట్ ఎంత.. ప్రభాస్‌ అనే స్థాయా నీది అంటూ.. ఘాటుగా పోస్టులు పెడుతున్నారు.

కల్కి మూవీలో ప్రభాస్‌ పాత్ర జోకర్‌లా ఉందని.. ఎందుకు అలాంటి కేరక్టర్ ఎంచుకన్నాడో అర్థం కావడం లేదు అంటూ.. అర్షద్ వార్సీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే ఫ్యాన్స్ కోపానికి కారణం అయింది. బాలీవుడ్ హీరోలు, సినిమాలు అంటేనే.. గుర్రుమంటున్నారు ఫ్యాన్స్‌. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం బాలీవుడ్‌ వాళ్లకి మింగుడు పడటం లేదని.. అందుకే ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేయిస్తానరంటూ పోస్టులు చేస్తున్నారు. అభిమానులు మాత్రమే కాదు.. టాలీవుడ్ స్టార్స్ కూడా.. అర్షద్‌ వార్సీకి కౌంటర్లు ఇస్తున్నారు.

ప్రభాస్‌ది వేరే లెవెల్ అని.. నీలాంటి వాడు చేసే ఛీప్ వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోరు అని పరోక్షంగా అర్షద్ వార్సీపై సెటైర్లు వేశారు హీరో సుధీర్ బాబు. ఇక నిర్మాత దిల్ రాజు, నేచురల్ స్టార్ నాని కూడా బాలీవుడ్‌పై సెటైర్లు వేశారు. ఇది చీప్‌ పబ్లిసిటీ స్టంట్‌ అన్నట్లుగా నాని సెటైర్లు వేశారు. అర్షద్‌కు లైఫ్‌లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఇప్పుడే వచ్చిందనుకుంట.. మీరు అలాంటి వారికి ప్రచారం ఇవ్వడం వల్లే వాళ్లు పాపులర్ అవుతున్నారు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ప్రభాస్‌ను తిట్టిన వారిపై టాలీవుడ్ అంతా ఏకమై విమర్శలు చేయడం చాలా మంచి పరిణామం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.