TOLLYWOOD: సెప్టెంబర్ నెల.. తెలుగు సినిమాకు హిట్లెన్ని..? ఫట్లెన్ని..?
నాలుగు వారాలలో వచ్చిన 18 మూవీల లిస్ట్ ఏంటని చూస్తే.. ఒక్కటంటే ఒక్క సినిమా పేరుకూడా గుర్తుండని పరిస్థితి. మైసూర్ పాక్‌లో మైసూర్‌ను వెతికినట్టు సెప్టెంబర్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ వెతికి మోసపోయారు ఆడియన్స్.
TOLLYWOOD: సెప్టెంబర్ సినీ పరిశ్రమకు షాకుల మీద షాకులిచ్చింది. అగస్ట్ అరిష్టం అనుకుంటే, సెప్టెంబర్ అంతకుమించిన దుమారం అనుకోవాల్సి వస్తోంది. సెప్టెంబర్‌ని ఖుషీ మూవీతో విజయ్ దేవరకొండ బోణీ కొట్టాడు. కాకపోతే బాక్సాఫీస్ మాత్రం ఖూనీ అయ్యింది. దర్శకుడి ప్రతిభ మరీ ఎక్కువవ్వటంతో రౌడీ స్టార్ లాంటి క్రేజ్ ఉన్న హీరో కాస్త జీరో అయ్యాడు. కనీసం తనకున్న ఇమేజ్ వల్లైనా రూ.120 కోట్ల వరకు బిజినెస్ చేసింది మూవీ. ఇక నవీన్ పోలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి కూడా సెంచరీ కాకపోయినా హిట్ కిందకే లెక్క.
ఇలాంటి యావరేజ్‌ని పక్కన పెడితే లాస్ట్ మంథ్‌లో 18 సినిమాలు వస్తే, 17 డిజాస్టర్లు, ప్లాపులే ఉన్నాయి. గత వారం స్కంద మూవీ రిలీజైతే.. అదేం మూవీ బొంద అన్నారు. ఏదో ప్రాస కలిసిందని కసితో అన్నారా? పాత రోత కథని చెప్పాడనే కోపంతో ఆడియన్స్ కామెంట్లతో పగతీర్చుకున్నారా అనే అంశం పక్కన పెడితే, సోమవారం కలెక్షన్స్‌తో స్కంద డిజాస్టర్ అని తేలింది. బాలయ్యకి తప్ప బోయపాటి మేకింగ్ మరెవరికి కలిసిరాలేదమో అనేంతగా భాక్సాఫీస్ భయపడింది. చంద్రముఖి 2 రజినీకాంత్ సినిమాకు పేరడీలా ఉండటం, పెదకాపు ప్రయోగంతో శ్రీకాంత్ అడ్డాల కన్‌ఫ్యూజ్ చేసి రౌండప్ చేయటంతో బాక్సాఫీస్ వణికింది. ఇక గత నెలలో.. అంటే నాలుగు వారాలలో వచ్చిన 18 మూవీల లిస్ట్ ఏంటని చూస్తే.. ఒక్కటంటే ఒక్క సినిమా పేరుకూడా గుర్తుండని పరిస్థితి.
మైసూర్ పాక్‌లో మైసూర్‌ను వెతికినట్టు సెప్టెంబర్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ వెతికి మోసపోయారు ఆడియన్స్. కనీసం అక్టోబర్‌లో అయినా ఆడియన్స్ కష్టాలు తీరుతాయా అంటే.. బాలయ్య భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు మీదే అందరి ఆశలు పెరిగిపోతున్నాయి. అనిల్ రావిపుడి, లోకేష్ కనకరాజ్ మీద హోప్స్ ఉండటంవల్లే ఈనెల టాలీవుడ్‌ని, కోలీవుడ్‌ని గట్టెక్కిస్తుందనే అంచనాలున్నాయి.