ప్రెగ్నెంట్ వైఫ్ తో మార్కో సినిమాకు వెళ్లిన టాలీవుడ్ హీరో.. ఆ తర్వాత ఏమైందంటే..!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ వైలెంట్ సినిమాగా నిలిచింది మార్కో. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో విడుదలైంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ వైలెంట్ సినిమాగా నిలిచింది మార్కో. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో విడుదలైంది. జనతా గ్యారేజ్, భాగమతి లాంటి సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు ఉన్ని. ఈయన హీరోగా హనీఫ్ అదేని తెరకెక్కించిన చిత్రం మార్కో. రివెంజ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో వైలెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దాని గురించి చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. అసలు సెన్సార్ బోర్డును తప్పించుకొని ఈ సినిమా బయటికి ఎలా వచ్చిందని చాలా మంది థియేటర్లో అనుకున్నారు అంటేనే.. ఏ రేంజ్ లో సినిమాలో హింస ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలావరకు సన్నివేశాలు చూస్తుంటేనే ఒళ్ళు గగ్గుర పొడుస్తుంది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ సినిమా చూడొద్దు అని దర్శక నిర్మాతలే ప్రమోషన్స్ లో చెప్పారు.
దీన్ని బట్టి వాళ్లు ఏ స్థాయిలో వైలెంట్ సినిమా చేశారో అనేది చెప్పకనే చెప్పారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా కొన్ని సీన్లు కట్ చేయాల్సి వచ్చింది. ఇక శాటిలైట్ లో మార్కో సినిమా ప్రదర్శించకూడదు అంటూ సెన్సార్ బోర్డు తీర్మానించింది. అంటే టీవీలో కూడా దీన్ని చూడలేము అన్నమాట. ఇలాంటి సినిమాకు వెళ్లాలంటే కాసింత ధైర్యం కూడా కావాలి. ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు అంటే.. ఈ మధ్య కాలంలో మార్కో సినిమాకు వెళ్లి సగం అయిన తర్వాత థియేటర్ నుంచి బయటికి వచ్చాడు ఒక టాలీవుడ్ హీరో. భార్యతో పాటు ఆ సినిమాకు వెళ్ళిన ఆయన.. సినిమా పూర్తి కాకుండానే బయటికి వచ్చేసాడు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు స్వయానా ఆ హీరో..!
ఇంతకీ ఎవరబ్బా ఆ హీరో అనుకుంటున్నారు కదా.. ఆయన మరెవరో కాదు కిరణ్ అబ్బవరం. మార్చి 14న ఈయన దిల్ రూబా సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే మార్కో సినిమా గురించి చెప్పాడు కిరణ్. కడుపుతో ఉన్న తన భార్య రహస్యతో కలిసి మార్కో సినిమాకు వెళ్లానని.. అయితే సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికి థియేటర్ నుంచి బయటికి వచ్చాము అని చెప్పాడు కిరణ్. ప్రెగ్నెంట్ గా ఉన్న తన వైఫ్ ఆ సినిమా చూడలేకపోయిందని.. ఆ వైలెన్స్ తట్టుకోలేక థియేటర్ నుంచి మధ్యలోనే వచ్చామన్నారు. ప్రస్తుతం కిరణ్ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.