Pawan Kalyan: బాక్సాఫీస్ దేవుళ్లు.. టిక్కెట్ కౌంటర్ లోనే పూజలు..
ఇక నుంచి భక్తులు గుడులకు పోవాల్సిన పనిలేకుండా, హీరోలే దేవుళ్లుగా మారి, థియేటర్స్‌ని టెంపుల్స్‌గా మారుస్తున్నారు. పవన్ కల్యాణ్ శంకరుడు, మహేశ్ బాబు కృష్ణుడు, ప్రభాస్ రాముడు, ఎన్టీఆర్ ఘటోద్కచుడుగా మారుతున్నారు.
Pawan Kalyan: టాలీవుడ్‌లో దేవుళ్ల లిస్ట్ పెరిగిపోతోంది. ఇక నుంచి భక్తులు గుడులకు పోవాల్సిన పనిలేకుండా, హీరోలే దేవుళ్లుగా మారి, థియేటర్స్‌ని టెంపుల్స్‌గా మారుస్తున్నారు. పవన్ కల్యాణ్ శంకరుడు, మహేశ్ బాబు కృష్ణుడు, ప్రభాస్ రాముడు, ఎన్టీఆర్ ఘటోద్కచుడుగా మారుతున్నారు.
గతంలో రాముడన్నా, కృష్ణుడన్నా తెలుగు జనాలకు ఎన్టీఆరే.. అప్పట్లో రామాయణం, మహాభారతం, మాయాబజార్, దాన వీరశూరకర్ణ.. ఇలా ఏ పౌరాణికమో, ఇతిహాసమో మూవీగా వస్తే, జనాలు చెప్పులు థియేటర్స్ బయటే వదిలేసి సినిమా చూసేవాళ్లట. మళ్లీ అలాంటి రోజులొచ్చేలా ఉన్నాయి. గోపాల గోపాల మూవీలో కృష్ణుడిగా కనిపించిన పవన్, ఇప్పుడు సాయితేజ్ మూవీలో శంకరుడిగా టైం క్యాలిక్యులేట్ చేస్తాడట. హీరోని గైడ్ చేస్తూ, విలన్ల బ్యాడ్ టైం గుర్తు చేస్తాడట. ఇక ఆదిపురుష్ ఎలాగూ రామాయణం నేపథ్యంగానే వస్తోంది.
కాబట్టి రాముడిగా ప్రభాస్ విల్లు ఎక్కు పెట్టాడు. ఖలేజాలో శివుడి అవతారం అనేలా మహేశ్‌ని చూపించిన త్రివిక్రమ్, ఇప్పుడు మహేశ్‌ని కృష్ణుడి అంశగా చూపించబోతున్నాడట. దేవరలో ఎన్టీఆర్ ఘటోత్కచ మానవ అవతారంగా కనిపించబోతున్నాడట.