TOLLYWOOD: వేగంగా షూటింగులు ప్లాన్ చేస్తున్న స్టార్ హీరోలు.. ఎందుకీ వేగం..?
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర.. దసరా లేదా దీపావళికి ఎట్టిపరిస్తితుల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారట. దసరా అంటే మరో 8 నెలల టైం ఉంది. ఇదేం అంత కష్టం అనటానికి లేదు. ఎందుకంటే విశ్వంభర మామూలు మూవీ కాదు.
TOLLYWOOD: నా సామిరంగా మూవీ గత సెప్టెంబర్‌లో మొదలైంది. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అంటే అంతా జోక్ అనుకున్నారు. కానీ, షూటింగ్ పూర్తైంది. వచ్చే వారం విడుదలకు సిద్దమయ్యేలా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఇది నిజంగా విచిత్రం. మరి దీన్ని చూసి ఇలా చేస్తున్నారో లేదంటే మరే కారణం ఉందో కాని మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర.. దసరా లేదా దీపావళికి ఎట్టిపరిస్తితుల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారట. దసరా అంటే మరో 8 నెలల టైం ఉంది.
HANUMAN: హనుమాన్ మూవీని తొక్కేస్తున్న దిల్ రాజు అండ్ కో..?
ఇదేం అంత కష్టం అనటానికి లేదు. ఎందుకంటే విశ్వంభర మామూలు మూవీ కాదు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కే సోషియో ఫాంటసీ మూవీ. దీనికి భారీ సెట్లు, గ్రాఫిక్స్ వర్క్ అని మొత్తం పెద్ద తతంగమే ఉంటుంది. కాబట్టి ఏడాది ఏడాదిన్నర టైం తీసుకుంటే తప్ప పూర్తి కాని మూవీని 8 నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. దానికి తగినట్లు షూటింగ్ స్పీడ్‌గా జరగటం చూస్తుంటే చిరు కూడా నాగ్ రూట్లో నడుస్తున్నట్టుంది. బాలయ్య భగవంత్ కేసరిని 6 నెలల్లో పూర్తి చేసిన అనిల్ రావిపుడి.. గతంలో పూరీ లానే 5 నెలల్లో తన మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చూపించి, 6 నెల్లలో తన 109వ సినిమాను పూర్తి చేయాలని బాబీకి బాలయ్య కండిషన్ పెట్టాడట. ఇక.. రవితేజతో హిందీ రైడ్ తెలుగు రీమేక్ మిస్టర్ బచ్చన్‌ని 4 నెలల్లో పూర్తి చేయబోతున్నాడు హరీష్ శంకర్. ఇది పవన్ ఇచ్చిన డెడ్‌లైన్. ఎందుకంటే ఈలోపు ఏపీ ఎలక్షన్స్ పూర్తవుతాయి.
సో.. ఏప్రిల్ ఎండ్ లేదంటే మే మధ్య నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలవ్వాలి. అందుకే రవితేజ మూవీని మెరుపు వేగంతోపూర్తి చేసేపనిలో ఉన్నాడు హరీష్ శంకర్. రెబల్ స్టార్ స్పిరిట్ కూడా 6 నెలల్లో పూర్తవుతుందట. యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్‌ని వేగంగా పట్టాలెక్కించేందుకు సందీప్ రెడ్డి వంగ, స్పిరిట్‌ని జూన్‌లో మొదలు పెట్టి డిసెంబర్‌లోగా పూర్తి చేస్తాడట. సంక్రాంతికి రిలీజ్ చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి యానిమల్ పార్క్ పనులు మొదలు పెడతాడట. ఇలా ఎవరి లెక్కలు వాళ్లకి ఉన్నాయి.