MEGASTAR CHIRANJEEVI: సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ సాహసం చేస్తున్న మెగాస్టార్..

చిరంజీవి.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో ఎప్పుడో ట్రెండ్ సెట్ చేశాడు. కాకపోతే ఫస్ట్ టైం ఓ వీరుడే. అతిలోక సుందరి కోసం ముల్లోకాల్లో వెతికే సాహసం మాత్రం మొదటి సారి జరుగుతోంది. అలాంటి కాన్సెప్ట్‌ విశ్వంభర మూవీ రాబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2024 | 08:28 PMLast Updated on: Jan 08, 2024 | 8:28 PM

Tollywood Heroes Trying To Play New Roles In Their Movies

MEGASTAR CHIRANJEEVI: ఇంతవరకు ఎవ్వరూ చేయని పాత్ర చేసినా, ఎవరూ చేయని మూవీతో ప్రయోగం చేసినా అదో ట్రెండ్ సెట్టర్ ఎక్స్‌పరిమెంట్ అవుతుంది. అలాంటి ప్రయత్నమే టాలీవుడ్ నుంచి శాండిల్ వుడ్ వరకు హీరోలు చేస్తున్నారు. చిరంజీవి.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో ఎప్పుడో ట్రెండ్ సెట్ చేశాడు. కాకపోతే ఫస్ట్ టైం ఓ వీరుడే. అతిలోక సుందరి కోసం ముల్లోకాల్లో వెతికే సాహసం మాత్రం మొదటి సారి జరుగుతోంది. అలాంటి కాన్సెప్ట్‌ విశ్వంభర మూవీ రాబోతోంది.

PRABHAS: భయపెడతాడా..? భయపడతాడా..? ప్రభాస్ కొత్త మూవీ రిస్కేనా..

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్‌ని ఇంతవరకు లోకేష్ కనకరాజ్ స్టైల్ మేకింగ్‌లో చూడలేదు. అది ఈ ఏడాది మొదటి సారి సాధ్యంకానుంది. వచ్చే ఏడాది విడుదలయ్యేలా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక కేజీయఫ్ ఫేం యశ్ ఫస్ట్ టైం కంప్లీట్ విలన్‌గా కనిపించబోతున్నాడు. కేజీఎఫ్‌లో రాఖీ భాయ్‌గా కనిపించిన తను మరొకరి మూవీలోనే కాదు తన సినిమాలో తానే విలన్‌గా కనిపించబోతున్నాడు. ఒకటి హిందీ రామాయణంలో రావణుడిగా రణ్‌బీర్‌కి ఆపోజిట్‌లో యశ్ కనిపిస్తూనే, టాక్సిక్ మూవీలో విలన్‌గా కనిపించేందుకు సిద్దమయ్యాడు. ఫస్ట్ టైం హీరోలు లేని కంప్లీట్ విలనీ స్టోరీలో విలన్‌గానే కనిపిస్తాడట. అంటే రాబిన్ హుడ్‌లా మాత్రం కాదని తెలుస్తోంది. అందుకే టాక్సిక్ అంటూ విషాన్నే టైటిల్‌గా పెట్టారు. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చేస్తున్నాడు.

అది కూడా రెండు భాగాలుగా తెరకెక్కే ప్రాజెక్ట్. కాబట్టే ఫస్ట్ టైం టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అన్న అంచనాలున్నాయి. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ టైం తన కెరీర్‌లో పోలీస్ పాత్ర వేస్తూ స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు. ఇలా హిస్టరీలో ఫస్ట్ టైం టాప్ హీరోలు పూర్తిగా రూట్ మార్చి ఈ ఏడాది ఊహించని పనులు చేస్తున్నారు.