Tollywood Hero’s: బాలీవుడ్ కి గుణపాఠం.. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ క్యా సీన్ హై..
బాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ కొన్నేళ్ల క్రితం వరకు తమని మించిన తోపులు లేరనుకున్నారు. సౌత్ ని చిన్న చూపు చూశారు. ఫలితం బాహుబలి, త్రిబుల్ ఆర్, విక్రమ్, కేజీయఫ్, పుష్ప రూపంలో వాళ్ల మార్కెట్ ని సౌత్ బ్యాచ్ కబ్జా చేసింది. వాళ్లెన్నడూ చూడని వసూళ్ల వరదని సౌత్ బ్యాచ్ చూపించింది.
ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ, అండ్ కో ఇప్పుడు నార్త్లో కూడా ప్రతీ ఇంట్లో వినిపించే పేర్లు. ఒకప్పుడు ఖాన్లు, కపూర్లు, వీళ్ల పేరే నార్త్ ఆడియన్స్ నోళ్లలో నానేవి.. వన్స్ సౌత్ సినిమాలు, నార్త్లో దుమ్ముదులిపాక, ఖాన్లు, కపూర్లు పోయి ప్రభాస్ లు, చరణ్, ఎన్టీఆర్ లు వచ్చారు..
ఇలాంటి అనుభవం బాలీవుడ్ స్టార్స్ కి, ఫిల్మ్ మేకర్స్ కి గుణపాఠంగా మారినట్టుంది. అందుకే పాన్ ఇండియా లెవల్లో సందడి చేసేందుకు వాళ్లు కూడా లార్జర్ దేన్ లైఫ్ అనిపించే సినిమాల లిస్టు పెంచేస్తున్నారు. అందుకే టైగర్ వర్సెస్ పఠాన్ అని, హ్రుతిక్ వర్సెస్ ఎన్టీఆర్ అంటూ వార్2 మూవీని ప్లాన్ చేశారు. పెద్ద హీరోలతో సినిమా అంటే లార్జర్ దేన్ లైఫ్ అనిపించే మూవీలే ఉండాలని కంకణం కట్టుకున్నారు. అంతా బానే ఉంది. భారీ స్కేల్ సినిమాలన్నీ రాజమౌళి మూవీలౌతాయా? నార్త్ లో కూడా మరో రాజమౌళి ఉండాలి కదా.. కనీసం సుకుమారో, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టరో ఉండాలి.
అదే జరగట్లేదు. అవే కటౌట్లు, అవే కథలు.. కేవలం బడ్జెట్ లు పెరుగుతున్నాయి. సౌత్ నటులను తీసుకుంటే, ఇక్కడ మార్కెట్ కలిసొస్తుందనుకుంటున్నారు. అంతే తప్ప కథలు, రాసే వ్యక్తులు, తీసే మనుషులు, వాళ్ల ఆలోచనల్లో మార్పులేదు.. కాబట్టి ఖాన్లు, కపూర్లు, ఇంకా మారాల్సి ఉంది.. సౌత్ లా దూసుకెళ్లాలంటే, లార్జర్ దేన్ లైఫ్ అనిపించే మూవీలు తీయాలంటే, ఎమోషన్స్ తోపాటు దేశీ కంటెంట్ పడాల్సిందే.. అదే జరగట్లేదు..