Allu Arjun : అంతర్జాతీయ వేదికపై టాలీవుడ్ ఐకాన్ స్టైలిష్ స్టార్.. అల్లు అర్జున్..
అంతర్జాతీయ వేదికపై టాలీవుడ్ ఐకాన్ స్టైలిష్ స్టార్.. అల్లు అర్జున్..

అంతర్జాతీయ వేదికపై టాలీవుడ్ ఐకాన్ స్టైలిష్ స్టార్.. అల్లు అర్జున్..

బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా గ్లోబర్ హీరోగా మారిపోయాడు.

తన నటనతో, డైలాగ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు.

ఈ స్టార్ కు విదేశాల్లోనూ ఫుల్ క్రేజ్ ఉంది.

జర్మనీలోని బెర్లిన్ లో నిర్వహించే ఎంతో ప్రతిష్టాత్మకమైన “74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్” లో పాల్గొనేందుకు అల్లు అర్జున్ కు ఆహ్వానం వచ్చింది.

తాజాగా ఈ ఈవెంట్ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొననున్నాడు.


అర్జున్ తన పర్యటనలో అంతర్జాతీయ చిత్రనిర్మాతలు, నిర్మాతలు.

మార్కెట్ కొనుగోలుదారులతో సంభాషించనున్నారు. అలాగే స్క్రీనింగ్‌తో పాటు అంతర్జాతీయ ప్రెస్‌తో ఇంటరాక్ట్ అవుతాడు.

పుష్ప సినిమాలో మంచి నటన కనబర్చించినందుకు ఉత్తమ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో పుష్ప2 షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నాడు.