Tollywood : చిన్న సినిమాలు.. భారీ ప్రశంసలు
టాలీవుడ్ ఈ ఏడాది ఓ విచిత్రమైన సిట్యుయేషన్ ని ఫేస్ చేస్తోంది. మాస్ మాయలో పడి పెద్ద హీరోలు ఎదురుదెబ్బలు తింటోంటే.. చిన్న హీరోలు మాత్రం ఎదురేలేదన్నట్టుగా దూసుకుపోతున్నారు. స్టార్ డమ్ కోసం పోయి ఏది పడితే ఆ సినిమా చేసి బడా హీరోలు చేతులు కాల్చుకుంటోంటే.. అందరినీ మెప్పించే కథలతో చిన్నహీరోలు సత్తా చాటుతున్నారు.
టాలీవుడ్ ఈ ఏడాది ఓ విచిత్రమైన సిట్యుయేషన్ ని ఫేస్ చేస్తోంది. మాస్ మాయలో పడి పెద్ద హీరోలు ఎదురుదెబ్బలు తింటోంటే.. చిన్న హీరోలు మాత్రం ఎదురేలేదన్నట్టుగా దూసుకుపోతున్నారు. స్టార్ డమ్ కోసం పోయి ఏది పడితే ఆ సినిమా చేసి బడా హీరోలు చేతులు కాల్చుకుంటోంటే.. అందరినీ మెప్పించే కథలతో చిన్నహీరోలు సత్తా చాటుతున్నారు.
సినిమా అంటే స్టార్ కాస్ట్ కాదు, భారీ బడ్జెట్ కాదు, నెక్స్ట్ లెవల్ ప్రమోషన్స్ కాదు, పాన్ ఇండియా రేంజ్ కాదు. సినిమా అంటే కంటెంట్. కంటెంట్ లేకుండా.. ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత పెద్ద స్టార్ హీరో చేసినా.. అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇదే విషయాన్ని చాలా సినిమాలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. ఈ ఏడాది అలా వచ్చిన కొన్ని సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. 5 నుంచి 10 కోట్ల తో తెరకెక్కిన సినిమాలు 50 నుంచి 90 కోట్లు వసూల్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. బలగం మూవీ.. చిన్న సినిమాగా వచ్చి చరిత్ర సృష్టించింది. మౌత్ టాక్ తోనే.. మొదటిరోజు కంటే రెండో రోజు.. రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. ఎన్నో ఇంటర్ నేషనల్ అవార్డులను సొంతం చేసుకోవడంతో బలగం టీమ్ సంబరాల్లో మునిగి తేలిపోయింది. ఆరిపోయిందనుకున్న చిన్న సినిమా జ్యోతిని నిలబెట్టి.. చరిత్రలో కలిసి పోయిందనుకున్న ఆర్ట్ సినిమా ఫ్లేవర్ ని మళ్లీ గుబాళింపజేసిందీ బలగం మూవీ
చిన్న సినిమా అనేది చచ్చిపోయింది..చిన్న సినిమాలు తీయడం దండగ..చిన్న సినిమాల్ని జనం చూడడం లేదు.. చిన్న సినిమాలని ఓటీటీలు చిన్న చూపు చూస్తున్నాయన్నవాళ్ల నోళ్లు మూయించింది బేబి మూవీ. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయంను సొంతం చేసుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ యూత్ తో పాటు సెలబ్రెటీల ప్రశంసలు అందుకుంది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా చాలా చిన్న సినిమాగా రిలీజై సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది సామజవరగమన. ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కూడా బాక్సాఫీస్ పై సత్తా చాటింది. ఇక రీసెంట్ గా రిలీజైన మ్యాడ్, మూవీ .. సక్సెస్ ఫుల్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సినిమా మొత్తం నవ్వులే నవ్వులు ఉండటంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక మంగళవారం మూవీ కూడా జనాలు బాగానే భయపెట్టింది. మొత్తానికి 2023 లో పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాయి.