TOLLYWOOD: పాన్ ఇండియా లెవల్లో దండయాత్ర చేయనున్న టాలీవుడ్..
త్రిబుల్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన తారక్‌తో కొరటాల శివ తీస్తున్న దేవర ఏప్రిల్ 5కి రిలీజ్ కాబోతోంది. మేలో కల్కి 2898 ఏడీ అంటూ ప్రభాస్ దండెత్తబోతున్నాడు. ఆగస్ట్‌లో పుష్ప 2 రానుంది. ఇక రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ దసరా స్పెషల్‌గా రానుంది.
TOLLYWOOD: 2024 పాన్ ఇండియా సినిమాల లిస్ట్ చూస్తే టాలీవుడ్ దూకుడు ఈ ఏడాది పెరిగేలా ఉంది. బాలీవుడ్, కోలీవుడ్ ఈ ఇయర్ సైలెంట్ అవ్వాల్సి వచ్చేలా ఉంది. ఇక తెలుగు సినిమాకు ఈ ఏడాది అసలైన పోటీ దారంటే, హాలీవు్డ్ మూవీలే అనుకోవాల్సి వస్తోంది. ఈ ఇయర్ హనుమాన్ లాంటి లో బడ్జెట్ మూవీతో టాలీవుడ్ పాన్ ఇండియా లెవల్లో సందడి షురూ చేసింది. కానీ, అసలు సందడంటే ఏప్రిల్ 5కే మొదలు కానుంది. త్రిబుల్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన తారక్‌తో కొరటాల శివ తీస్తున్న దేవర ఏప్రిల్ 5కి రిలీజ్ కాబోతోంది. మేలో కల్కి 2898 ఏడీ అంటూ ప్రభాస్ దండెత్తబోతున్నాడు. ఆగస్ట్‌లో పుష్ప 2 రానుంది.
MEGASTAR CHIRANJEEVI: సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ సాహసం చేస్తున్న మెగాస్టార్..
ఇక రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ దసరా స్పెషల్‌గా రానుంది. ఇవన్నీ పాన్ ఇండియా మార్కెట్‌ని షేక్ చేసే రేంజ్ ఉన్న సినిమాలే. అదే బాలీవుడ్ విషయానికొస్తే.. హ్రితిక్ రోషన్ చేసిన ఫైటర్ మాత్రమే ఈ నెల 25న రానుంది. అది తప్ప మరో పాన్ ఇండియా సందడి అక్కడ నుంచి ఈ సారి కష్టమే. వార్ 2 వచ్చే ఏడాదికే రావొచ్చు. ఇక పటాన్ వర్సెస్ టైగర్ కూడా వచ్చే ఏడాదికే రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. ఓవరాల్‌గా ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఒక్క పెద్ద సినిమా కూడా బాలీవుడ్ నుంచి వచ్చేలా లేదు. ఇక కోలీవుడ్ విషయానికొస్తే రజినీ లాల్ సలామ్‌లో గెస్ట్ రోల్ చేశాడు. కాబట్టి అది పాన్ ఇండియా మూవీ అనలేం. లోకనాయకుుడ కమల్ హాసన్‌తో శంకర్ తీసిన భారతీయుడు 2 మాత్రం పాన్ ఇండియా లెవల్లో దండెత్తనుంది. కానీ, ఒకప్పటి భారతీయుడు రేంజ్‌లో ఆకట్టుకుంటుందా అంటే చెప్పలేం. ఇక విజయ్‌తో వెంకట్ ప్రభు తీసే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కూడా పాన్ ఇండియా సీన్ ఉందా అంటే విడుదలై వండర్ చేసేదాక చెప్పలేం. ఎలా చూసినా అరవ అడ్డాలో కూడా తిప్పి తిప్పి కొడితే ఈ ఏడాది 2కు మించి పాన్ ఇండియా మూవీల్లేవు.
ఎటొచ్చీ.. ఈ ఏడాది పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమాకు పోటీ ఇచ్చేది హాలీవుడ్ సినిమాలే. అసలే ఇండియాలో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ పెరిగి, అలా ఇంగ్లీష్ సినిమాలకు మార్కెట్ పెరుగుతోంది. ఎలాగూ వాళ్ల భారీ బడ్జెట్‌కి క్వాలిటీ గ్రాఫిక్స్ స్టోరీ టెల్లింగ్ తోడవ్వటం కూడా, వాళ్లకి కలిసొచ్చే అంశమే. అలాచూస్తే ఈ ఏడాది ఫ్యూరియస్ అంటూ మ్యాడ్ మ్యాక్స్ సీక్వెల్ తోపాటు, బీ కీపర్, డెడ్ పూల్ 3, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సీక్వెల్, కూంగ్ ఫూ పాండా 4వ సీక్వెల్.. ఇలా డజన్‌కి పైగా సినిమాలు మార్చ్ నుంచి సెప్టెంబర్ వరకు మన ఇండియా మార్కెట్ ని కుదపేసేలా ఉన్నాయి. అయినా కూడా భారీ రీచ్ వల్ల తెలుగు సినిమాదే పైచేయి అయ్యే ఛాన్స్ ఉంది.