Hanuman Pre-Release Event : హనుమాన్ కోసం, మెగాస్టార్, ప్రభాస్..?
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్లో వస్తున్న హనుమాన్ సినిమా.. జనవరి 12న భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అదే రోజు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ రిలీజ్ అవుతున్న కూడా తగ్గేదేలే అంటున్నాడు హనుమాన్. అంతేకాదు.. పాన్ ఇండియా రీచ్ కోసం ప్రభాస్ లేదంటే మెగాస్టార్‌ను రంగంలోకి దింపుతున్నట్టుగా తెలుస్తోంది.

Tollywood Megastar Chiranjeevi, Pan India Baahubali Prabhas are entering the field for Hanuman.
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్లో వస్తున్న హనుమాన్ సినిమా.. జనవరి 12న భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అదే రోజు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ రిలీజ్ అవుతున్న కూడా తగ్గేదేలే అంటున్నాడు హనుమాన్. అంతేకాదు.. పాన్ ఇండియా రీచ్ కోసం ప్రభాస్ లేదంటే మెగాస్టార్‌ను రంగంలోకి దింపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. జనవరి 7న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా రానున్నట్టు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది.
సలార్ సినిమా హిట్ అయినా కూడా ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు రెబల్ స్టార్ ప్రభాస్. అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది సలార్. ఇప్పటికే 650 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సలార్ కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పట్టింది. నైజాంలో సలార్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు హనుమాన్ సినిమాను కూడా మైత్రీ వారే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
దీంతో ప్రభాస్‌ను ఈవెంగ్ గెస్ట్‌గా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ ఈవెంట్ గెస్ట్‌గా వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. రేపో మాపో ఈ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది.కాగా, ‘హనుమాన్’ సినిమాలో హనుమంతుడి పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. మూవీ టీమ్ దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి హనుమాన్ కోసం మెగాస్టార్ వస్తాడా? ప్రభాస్ వస్తాడా? అనేది చూడాలి. ఈ ఇద్దరిలో ఎవరు గెస్ట్‌గా వచ్చినా.. ఆటోమేటిక్‌గా హనుమాన్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతాయి.