Pushpa 2 : పుష్ప – 2లో ఈ సారి ఊ అంటావా కు మించిన ఐటెం సాంగ్..
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ "పుష్ప ది రూల్". పుష్ప తో సంచలనం సృష్టించిన ఈ మూవీకి.. సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీ కోసం సౌత్ ప్రేక్షకులు నార్త్ ప్రేక్షకులు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు.

Tollywood most awaited movie Pushpa The Rule Pushpa 2 Pushpa - 2 this time the item song beyond Oo Antava
టాలీవుడ్మో (Tollywood) స్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప ది రూల్”(Pushpa The Rule) . పుష్ప తో సంచలనం సృష్టించిన ఈ మూవీకి.. సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీ కోసం సౌత్ ప్రేక్షకులు నార్త్ ప్రేక్షకులు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.. ఇదిలా ఉండగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
పుష్పలో ఊర మాస్ గెటప్‌లో అల్లు అర్జున్ మాస్ ఆడియన్స్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌ను సైతం అలరించాడు. ఇక పుష్ప 2 (Pushpa 2 ) కోసం డైరెక్టర్ సుకుమార్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు. ఆడియెన్స్ అంచనాలకు తగ్గకుండా తన అచ్చొచ్చిన ఫార్మూలాను యాడ్ చేస్తున్నాడు. సమంత చేసిన ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మామ పాట పార్ట్ వన్ లో హైలెట్ గా నిలవగా.. పార్ట్ 2 లో ఐటెం సాంగ్ (Item Song ) ఉంటుందా ఉండదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఇప్పుడు దానికి ఆన్సర్ దొరికినట్లు తెలుస్తోంది.
పుష్ప- 2 ఆడియన్స్ ఊహించినట్లుగానే స్పెషల్ కు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం చాలా మంది స్టార్ హీరోయిన్స్ ని పరిశీలించారట లెక్కల మాస్టర్ బాలీవుడ్ బ్యూటీ ఆలియా (Alia Bhatt) ను సుకుమార్ అప్రోచ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ఆలియా భట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకోసం భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. బన్నీ అలియా అని తెలియడంతో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇప్పటికే తెలుగు ఫ్యాన్స్ కు అలియా భట్ సుపరిచితమే. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవర చిత్రంలో ఆలియా నటించాల్సి ఉండగా.. అది కుదర్లేదు. ఇక పుష్ప చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా కాగా.. అనసూయ, సునీల్. ఫహద్ ఫాజిల్ కీలక రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.