సంక్రాంతి మెగా పండగ కాదు… బాలయ్య మీదే అందరు ఫైర్..

సంక్రాంతి మెగా పండగ కాదు, దంగడ... ఇది బాలయ్య మీదే అందరు ఫైర్ అవుతున్నారనిపించే కామెంట్... తన డాకూ మహారాజ్ మూవీ ట్రైలర్ పేలినా, పాట మీద విమర్శల తూటాలు సునామీలా మారాయి. ఇక్కడ కామెంట్ చేస్తే నార్త్ ఇండియా వరకు కామెంట్ల రీసౌండ్ వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2025 | 06:58 PMLast Updated on: Jan 10, 2025 | 6:58 PM

Tollywood Movie Fans Target On Balakrishna Movie

సంక్రాంతి మెగా పండగ కాదు, దంగడ… ఇది బాలయ్య మీదే అందరు ఫైర్ అవుతున్నారనిపించే కామెంట్… తన డాకూ మహారాజ్ మూవీ ట్రైలర్ పేలినా, పాట మీద విమర్శల తూటాలు సునామీలా మారాయి. ఇక్కడ కామెంట్ చేస్తే నార్త్ ఇండియా వరకు కామెంట్ల రీసౌండ్ వినిపిస్తోంది. ఎన్ని చేసినా నటిసింహాన్ని ఎవరేం చేయలేరనొచ్చు.. కాని సంక్రాంతి పండక్కి, వసూల్లు బదులు వివాదాలే వచ్చేలా ఉన్నాయి. ఐతే గుడ్డిలో మెల్లేంటంటే, తెలంగాణలో సినిమా టిక్కెట్ రేట్లు తగ్గుతుండటంతో, ఇక ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ ముందు క్యూ కడతారనుకున్నారు. నిజానికి థియేటర్స్ కి వద్దామనుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ ని రాకుండా రేట్లతో గేట్లు వాళ్లే క్లోజ్ చేశారు. తీరా ఇప్పుడు పండక్కి థియేటర్స్ వైపు అడుగులేద్దామనుకుంటే, ఒకటి కంటెంట్ లో కంపు పెరిగిందనే కామెంట్లు పెరిగాయి. మళ్లీ తెలంగాణలో కూడా టిక్కెట్ రేట్ల ట్విస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంటిదగ్గరే రెస్ట్ తీసుకునేలా చేస్తోంది. అంటే సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ కి ఈ ముహుర్తంతో మూడినట్టే కనిపిస్తోందా? 

సంక్రాంతి పండగొస్తోంది…కాని డాకూ మహరాజ్ మాత్రంఈ పండగని దండగ చేస్తోందా? ఈ డౌట్ వెనక వందలకొద్ద కామెంట్లు కారణమౌతున్నాయి. డాకూ మహారాజ్ లో దబిడి దిబిడి సాంగ్ నీచంగా ఉందనే ట్రోలింగ్స్ పెరగటంతో, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సినిమా భయపెట్టేలా ఉందంటున్నారు

ఆ ఒక్క పాట, అందులో అసభ్యంగా అనిపించే డాన్సులు లేకపోతే, ఢాకూ మహారాజ్ కి వచ్చిన నష్టమేంటనే ప్రశ్నలు ఎదురౌతున్నాయి. అయితే ఇక్కడ అదొక్కడే సంక్రాంతి సినిమాలను డ్యామేజ్ చేసే అంశం కాదు.. అంతకుమించిన రీజన్ టిక్కెట్ల రేట్ల విషయంలో మారని విజన్

భారీగా బడ్జెట్ లు పెంచి, అంతే భారీగా టిక్కెట్ రేట్లు పెంచుకుని, సినిమాను రిలీజ్ చేసిన వారంలో వసూల్లు రాబట్టేయాలనే కక్కుర్తే తెలుగు సినిమాను మింగేస్తోంది. ఏదో బాహుబలి, త్రిబుల్ ఆర్ ఇలా కొన్ని సినిమాలే టిక్కెట్ రేట్ పెంపు పెద్దగా షాక్ ఇవ్వలేదు కాని, ప్రతీ పెద్ద మూవీ ఇలా టిక్కెట్ రేట్లు పెంచితే, ఫ్యామిలీ ఆడియన్స్ కి థియేటర్స్ ముందు గేట్లు మూసేసినట్టే..

గత ఐదేళ్లలో 80శాతం వరకు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ వైపు అడుగులేయటం మానేశారు. సరే పుష్ప 2 వివాదం తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోలు లేవు, టిక్కెట్ రేట్లు పెరగవని తెలంగాణ ప్రభుత్వం తేల్చింది. దీంతో గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీలకు, ఫ్యామిలీఆడియన్స్ పోటెత్తే ఛాన్స్ ఉందనుకున్నారు

నిజమే భారీగా టిక్కెట్లు రేటు పెంచితే యంగ్స్ స్టర్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఫ్యాన్సే థియేటర్స్ కి వస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అన్ని వేలు ఖర్చు చేసేందుకు మాత్రం వెనకడుగు వేస్తారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి, ఎలాగూ ఓటీటీలో వస్తుంది కాబట్టి అక్కడే చూద్దామ్ లే అనుకునే బ్యాచ్ కూడా పెరిగింది. ఫలితంగా 80శాతం ఫ్యామిలీ ఆడియన్స్,మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ థియేటర్స్ ముఖం చూడటం కూడా మానేశాయి..

సో తెలంగాణ లో టిక్కెట్ రేట్ల పెంపు ఉండదు కాబ్టటి, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే, టిక్కెట్లు రేట్లపెంపుతోకంటే ఎక్కువ లాభం ఉంటుందన్నారు. కాని మళ్లీ తెలంగాణ ప్రభుత్వం కూడా టిక్కెట్ రేట్ల విషయంలో వెసులు బాటు ఇచ్చిందన్న వార్తతో ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ని టాలీవుడ్ తిరిగి థియేటర్స్ కి రప్పంచలేదనంటున్నారు. కామెంట్ల దాడి పెంచారు.