Mangalavaram: మంగళవారం, సరిపోదా శనివారం మూవీలపై సెటైర్లు
మంగళవారం మూవీ టైటిల్ వెనక ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవని తేల్చాడు దర్శకుడు. సరే సరిపోదా శనివారం టైటిల్ అయినా సవ్యంగా ఉందా అంటే, ఏం సరిపోతుంది..? ఏం సరిపోదు అన్న ప్రశ్నలతో కొత్త కొత్త మీనింగ్స్ వస్తున్నాయి.
Mangalavaram: మంగళవారం టైటిట్‌తో ఆర్ఎక్స్ హండ్రెడ్ ఫేం అజయ్ భూపతి మూవీ రాబోతోంది. తర్వాత సరిపోదా శనివారం టైటిల్‌తో నాని సినిమా మొదలైంది. ఏంటిది.. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు అన్నీ వదిలేసి వారాల మీద పడ్డారనేచర్చ పెరిగింది. అదేదో బూతు సామెత అన్నట్టు మంగళవారం టైటిల్ పెట్టిన వెంటనే ట్రోలింగ్స్ వచ్చాయి.
కానీ, మంగళవారం మూవీ టైటిల్ వెనక ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవని తేల్చాడు దర్శకుడు. సరే సరిపోదా శనివారం టైటిల్ అయినా సవ్యంగా ఉందా అంటే, ఏం సరిపోతుంది..? ఏం సరిపోదు అన్న ప్రశ్నలతో కొత్త కొత్త మీనింగ్స్ వస్తున్నాయి. ఐతే అందుతున్న సమాచారం ప్రకారం మంగళవారం మూవీ ఆరోజు జరిగే మర్డర్స్ మీద ఫోకస్ చేస్తే, శనివారం శోభనం కాన్సెప్ట్ తో నాని సినిమా రాబోతోందట. ఇలా ఒక్కో వారాన్ని ఒక్కో జోనర్ మూవీ కోసం ఫిల్మ్ మేకర్లు వాడేస్తుంటే, శుక్రవారం సీన్లోకి వచ్చేస్తున్నాడు శర్వానంద్. శుక్రవారం మంచి పనులు మొదలు పెట్టే నమ్మకాలున్న పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నాడట.
ఇప్పటికే మహానుభావుడులో అతి శుభ్రత వ్యాదితో సతమతమయ్యే హీరోగా కనిపించాడు శర్వా. ఇప్పుడు సెంటిమెంట్స్ అంటే పిచ్చి ఉన్న హీరో పాత్రలో నవ్వించబోతున్నాడు. మొత్తానికి మంగళవారం, శుక్రవారం, సరిపోలేదా శనివారం టైటిల్స్‌తో తెలుగు ఫిల్మ్ మేకర్స్ వారాలబ్బాయిలుగా మారారు.