టాలీవుడ్ కు “శివుడే” దిక్కు అయ్యాడా…?
భక్తి కూడా వ్యాపారం అయిపోయిన రోజుల్లో... సినిమా పరిశ్రమ కూడా భక్తిని వ్యాపారంగా మార్చడంలో సక్సెస్ అవుతోంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా భారీగా భక్తులు ఉన్న శివుడ్ని ఇప్పుడు తమ సినిమాలకు కేంద్రంగా ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు.
భక్తి కూడా వ్యాపారం అయిపోయిన రోజుల్లో… సినిమా పరిశ్రమ కూడా భక్తిని వ్యాపారంగా మార్చడంలో సక్సెస్ అవుతోంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా భారీగా భక్తులు ఉన్న శివుడ్ని ఇప్పుడు తమ సినిమాలకు కేంద్రంగా ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. శివుడుతో సినిమా చేస్తే సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఇప్పుడు జనాల్లోకి కూడా బలంగా వెళ్ళింది. అందుకే అగ్ర దర్శకుల నుంచి చిన్న దర్శకుల వరకు అందరూ ఇదే ఫాలో అవుతూ తమ సినిమాల్లో శివయ్యను ఓ రేంజ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
అఖండ సినిమాతో ఇది మరింత ఊపు అందుకుంది. అందులో బాలకృష్ణ నటన అఘోరా పాత్రలో జనాల మతి పోగొట్టింది. శివుడుకి పరమ భక్తుడిగా ఉంటాడు బాలయ్య. ఈ సినిమాలో బాలయ్య డైలాగులు అఘోరాలు ఎంత నిష్టగా ఉంటాయో నిరూపిస్తాయి. ఇక ఆ సినిమా సీక్వెల్ కూడా వస్తోంది ఇప్పుడు. ఇది అధికారికంగా ప్రకటించారు కూడా. మంచు విష్ణు ఇప్పుడు… శివుడి భక్తుడు కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తమన్నా శివ భక్తురాలిగా ఓదెల 2 సినిమాలో కనపడుతున్నారు. ఇటీవల వచ్చిన ఒక లుక్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. సుదీర్ బాబు జటాధరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమా పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా త్వరలోనే షూట్ కూడా పూర్తి చేసుకుంటుంది. అలాగే ‘ఏ మాస్టర్ పీస్” అనే సినిమా సైతం ఇలా శివుడి బ్యాక్ డ్రాప్ లోనే రానుంది. హైందవ అనే టైటిల్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక కథతో రెడీ అవుతున్నారు.
ఈ సినిమాకు కూడా శివుడే మూలం. ఇటీవల వచ్చిన డబుల్ ఇస్మార్ట్ లో శివుడి సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇలా శివుడ్ని ఇప్పుడు దర్శకులు తమ సినిమాల కోసం ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మార్చేసారు. శివుడి గొప్పతనం తెలియజేస్తూ… పవర్ ఫుల్ సీన్స్ ని ప్లాన్ చేస్తూ మాస్ డైలాగ్స్ యాడ్ చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.