TOLLYWOOD: నార్త్ మార్కెట్‌లో దూసుకుపోతున్న తెలుగు హీరోలు.. కో అంటే కోట్లు..
మన వాళ్ల సినిమాలకు హిందీ మార్కెట్లో వందలకోట్ల బిజినెస్ ముందే జరగటం రికార్డే. అంతేకాదు ఖాన్లు, కపూర్లతో ప్రబాస్, బన్నీ, చెర్రీ, తారక్ పోటీ పడుతుంటే.. మనవాళ్లతోనే ఖాన్లు, కపూర్లు పోటీ పడలేకపోతున్నారు.
TOLLYWOOD: నార్త్ ఇండియాలో పుష్ప 2 మూవీ రైట్స్ రూ.200 కోట్లు పెట్టి కొన్నాడు అనిల్ తడానీ. ఇంతకి ఈ అనిల్ తడానీ ఎవరంటే.. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ భర్త. పుష్ప 2 మాత్రమే కాదు. చాలా వరకు తెలుగు సినిమాల నార్త్ ఇండియా రైట్స్ సొంతం చేసుకుని, టాలీవుడ్‌కి బాలీవుడ్‌లో ఫుల్ సపోర్ట్ ఇస్తున్న డిస్ట్రిబ్యూటర్. ఇక పుష్ప 2ని ఏకంగా 200 కోట్లకు నార్ ఇండియా రైట్స్ కొనేసుకున్నాడు అనిల్ తడాని.
Kalki 2898 Ad Release Date : కల్కి రిలీజ్ రూమర్లకు చెక్…
అడ్వాన్స్‌గా 50 కోట్లే ఇచ్చినా రిలీజ్ టైంలోగా మిగతా 150 కోట్లు ఇచ్చేలా డీల్ కుదిరింది. ఈ విషయంలో కల్కి, దేవర మూవీలను పుష్ప 2 బీట్ చేసింది. ఎందుకంటే కల్కి మూవీ నార్త్ ఇండియా రైట్స్‌ని అనిల్ తడానీ 100 కోట్లకే కొన్నాడట. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర నార్త్ ఇండియా రైట్స్ రూ.50 కోట్లకే కొనేశాడు అనిల్ తడాని. కాని పుష్ప 2 మాత్రం రూ.200 కోట్ల ధర పలకటమే హాట్ టాపిక్ అయ్యింది. అయితే అనిల్ తడానీ పుష్పకు సంబంధించిన నార్త్ ఇండియా మొత్తం మార్కెట్ రైట్స్ సొంతం చేసుకున్నాడని, ఇక కల్కి తాలూకు మహారాష్ట్ర, డిల్లీ రైట్స్ మాత్రమే అనిల్ తడానికి సొంతమయ్యాయని తెలుస్తోంది. మిగతా ఏరియా రైట్స్ కలిపితే కల్కి, దేవర తాలూకు నార్త్ ఇండియా రైట్స్ లెక్కలు కూడా 200 కోట్లు చేరొచ్చంటున్నారు.
ఏదేమైనా మన వాళ్ల సినిమాలకు హిందీ మార్కెట్లో వందలకోట్ల బిజినెస్ ముందే జరగటం రికార్డే. అంతేకాదు ఖాన్లు, కపూర్లతో ప్రబాస్, బన్నీ, చెర్రీ, తారక్ పోటీ పడుతుంటే.. మనవాళ్లతోనే ఖాన్లు, కపూర్లు పోటీ పడలేకపోతున్నారు. అసలు తెలుగు హీరోలకు తెలుగు స్టార్లే పోటీ అనేలా వార్ వన్ సైడ్ అయిపోతోంది.