TOLLYWOOD MOVIES: అసలేం జరుగుతోంది! పాన్ ఇండియా సినిమాలన్నీ వాయిదా..

బడా సినిమాలు వాయిదా పడటంతో హీరోల అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. అయితే లేట్‌గా వచ్చినా.. ఆ ఆలస్యానికి తగ్గట్టుగా అదిరిపోయే ఔట్‌పుట్ ఇస్తే.. అదే ఆనందం అనే అభిప్రాయంలో ప్రేక్షకులు ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2024 | 01:34 PMLast Updated on: Jan 24, 2024 | 1:34 PM

Tollywood Pan India Movies Are Postponed Here Is The Reason

TOLLYWOOD MOVIES: ఈ ఏడాది పలు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వాటిలో ప్రధానంగా ‘దేవర’, ‘కల్కి 2898 AD’, ‘పుష్ప-2’ సినిమాలపైనే అందరి దృష్టి ఉంది. అయితే ఇప్పుడు ఈ మూడు సినిమాలు వాయిదా పడ్డాయనే వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ‘దేవర’సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ.. ఒక్కసారి స్టార్ట్ చేశాక షూటింగ్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. పైగా 2024, ఏప్రిల్ 5న సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా ముందుగానే ప్రకటించారు.

BCCI AWARDS: కన్నుల పండుగగా బీసీసీఐ అవార్డులు.. మెరిసిన స్టార్ క్రికెటర్లు

అందుకు తగ్గట్టుగానే పక్కా ప్లానింగ్‌తో దేవర టీం అడుగులు ఉండటంతో.. ఏప్రిల్‌లో సినిమా విడుదల కావడం ఖాయమని భావించారంతా. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం, విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్‌కి గాయాలవ్వడం, వీఎఫ్ఎక్స్ వర్క్‌కి ఎక్కువ సమయం అవసరమవ్వడం, పాటల రికార్డింగ్ పూర్తి కాకపోవడం వంటి కారణాలతో దేవర వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఆగస్టులో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ లెవెల్‌లో సత్తా చాటగలిగే తెలుగు సినిమా ‘కల్కి 2898 AD’ అనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కావడంతో ఆలస్యమవుతూ వస్తోంది. 2024 సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు. మే 9న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీకి కూడా అనుమానమే అంటున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్‌కి మరింత సమయం తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే సన్నిహిత వర్గాలు మాత్రం మే 9కే కల్కి విడుదలవుతుందని చెబుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటిన ‘పుష్ప’కి కొనసాగింపుగా వస్తోంది ఈ సినిమా.

అందుకే ఆ అంచనాలను మ్యాచ్ చేసేలా.. పక్కా ప్లానింగ్‌తో ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ సమయం తీసుకొని, ఆలస్యంగా షూటింగ్ ప్రారంభించారు. అయితే నటుడు జగదీశ్ అరెస్ట్ సహా పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇంకా షూట్ చేయాల్సింది చాలా ఉంది. అనుకున్న డేట్‌కే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో కంగారుగా చుట్టేయకుండా.. కాస్త ఆలస్యమైనా మంచి ఔట్‌పుట్ ఇవ్వాలని మేకర్స్ చూస్తున్నారట. అందుకే ‘పుష్ప-2’ని డిసెంబర్‌కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పుష్ప మొదటి భాగం సైతం 2021లో డిసెంబర్‌లోనే విడుదల కావడం విశేషం. ఏది ఏమైనప్పటికీ ఇలా బడా సినిమాలు వాయిదా పడటంతో హీరోల అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. అయితే లేట్‌గా వచ్చినా.. ఆ ఆలస్యానికి తగ్గట్టుగా అదిరిపోయే ఔట్‌పుట్ ఇస్తే.. అదే ఆనందం అనే అభిప్రాయంలో ప్రేక్షకులు ఉన్నారు.