HANUMAN: చిన్న సినిమాలను తొక్కేస్తున్నదెవరు.. ఆ సినిమాను కూడా ఆపేస్తున్నారా..?

హైదరాబాద్‌లో 12న ఒక్క 8 స్క్రీన్లు తప్ప అన్నీ స్క్రీన్లలో గుంటూరు కారమే సందడి చేయబోతోంది. హనుమాన్‌కి 8 స్క్రీన్లే ఇక్కడ దక్కాయి. వైజాగ్‌లో సింగిల్ షో కూడా కష్టమే అంటున్నారు. దిల్ రాజు ఓ డిస్ట్రిబ్యూటర్‌గా హనుమాన్ మూవీని తొక్కేస్తున్నాడని అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 5, 2024 | 06:03 PMLast Updated on: Jan 05, 2024 | 6:03 PM

Tollywood Producers Prefer Only Big Movies

HANUMAN: గుంటూరు కారం మూవీ సౌత్‌లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. యూఎస్‌లో కూడా ఎక్కువ స్క్రీన్లలోనే విడుదల చేయబోతున్నారు. ఐతే హైదరాబాద్‌లో 12న ఒక్క 8 స్క్రీన్లు తప్ప అన్నీ స్క్రీన్లలో గుంటూరు కారమే సందడి చేయబోతోంది. హనుమాన్‌కి 8 స్క్రీన్లే ఇక్కడ దక్కాయి. వైజాగ్‌లో సింగిల్ షో కూడా కష్టమే అంటున్నారు. దిల్ రాజు ఓ డిస్ట్రిబ్యూటర్‌గా హనుమాన్ మూవీని తొక్కేస్తున్నాడని అన్నారు.

SALAAR: సలార్ వెయ్యికోట్ల కలకి బ్రేక్ వేస్తున్న కొత్త సినిమాలు

ఐతే తెలుగు రాష్ట్రాల్లో 12 కాకుండా 16కి సినిమా రిలీజ్ చేస్తే 50 థియేటర్లు అదనంగా ఇస్తామని డిస్ట్రిబ్యూటర్లు అంటే.. ఇక్కడ 50 థియేటర్స్ కోసం నార్త్‌లో 1200 స్క్రీన్లను వదులుకోవటానికి సిద్ధంగా లేము అని తెలిపింది హనుమాన్ టీం. సరే.. ఎవరెన్ని మాటలు చెప్పినా పెద్ద సినిమాలు హనుమాన్ మూవీని తొక్కేస్తున్నాయనే నిర్మాత వాదన ఆల్రెడీ జనాల్లోకి వెళ్లింది. తాజా సమాచారం ప్రకారం.. మరో తెలుగు మూవీ.. ఇంకో తెలుగు హీరో సినిమాకు కూడా పంచ్ ఇచ్చేలా ఉందట. వెంకటేష్ సైంధవ్ మూవీకి సైడ్ ఇవ్వాలని విడుదలని వాయిదా వేసుకున్న ఈగిల్ టీం ఫిబ్రవరిని టార్గెట్ చేసింది. కాని ఫిబ్రవరిలో డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ రాబోతోంది. ఆ సినిమాను వాయిదా వేసి ఆ ముహుర్తానికి ఈగిల్‌ని లాంచ్ చేయాలనుకుంటున్నారట.

విచిత్రం ఏంటంటే విశ్వక్ సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని కూడా ఇలానే తొక్కేసేలా ఉన్నారు. డిసెంబర్‌లో నాని, నితిన్ కోసం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మార్చ్‌కి వాయిదా వేశారు. తీరా అప్పుడు రిలీజ్ అనుకుంటే, ఫ్యామిలీ స్టార్‌ని మార్చ్ 8కి ప్లాన్ చేసి.. దిల్ రాజు ఇప్పడు విశ్వక్ సేన్ సినిమాను టార్గెట్ చేశాడంటున్నారు. ఇలా తొక్కేసే ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉండేలా ఉందనేస్తున్నారు.