Tollywood: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ యాక్టర్ మృతి..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. యాక్టర్‌గా, నిర్మాతగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి పేరు సంపాదించుకున్న కాస్ట్యూక్ కృష్ణ చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. చెన్నైలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోటకు చెందిన కృష్ణకు సినీ ఇండస్ట్రీ అంటే ఎంతో ఆసక్తి. ఆ ఇంట్రస్ట్‌తోనే 1945లో మద్రాస్ వెళ్లి అక్కడి సినిమా వాళ్ల దగ్గర అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేరారు.
చాలా తక్కువ టైంలోనే మంచి డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని రోజులకు టాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పాటు వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లకు కూడా ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. ఆయనలోని నటనను గుర్తించి కోడి రామకృష్ణ భారత్ బంద్ అనే సినిమాతో కృష్ణను యాక్టర్‌గా పరిచయం చేశాడు. యాక్టింగ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ. పెళ్లాం చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యారు.
యాక్టర్‌గానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా మంచి విజయాన్ని అందుకున్నారు కృష్ణ. జగపతిబాబు హీరోగా చేసిన పెళ్లిపందిరి సినిమాతో పాటు మరో 7 సినిమాలను ఆయన ప్రొడ్యూస్ చేశారు. కానీ కొందరు చేసిన మోసం వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. అప్పటి నుంచి చెన్నైలో తాను కొనుకున్న ఇంట్లోనే ఉంటున్నారు. వయసు మీదపడటంతో కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురైన కృష్ణ.. పరిస్థితి విషయమించడంతో చనిపోయారు.