Tollywood star director Boyapati : బోయపాటికి దిక్కెవరు..?

స్కంద అట్టర్ ఫ్లాప్‌ తో బోయపాటి ప్లాన్‌ మారిపోయింది. ప్లాన్‌ ఎ వర్కవుట్‌ కాకపోవడంతో.. ప్లాన్‌ బి వైపు చూస్తున్నాడు. కలిసొచ్చిన హీరో కోసం కసరత్తులు స్టార్ట్‌ చేసి.. ఇంకో ఆరు నెలలపాటు కథపైనే కూర్చుంటాడట. ఇంతకీ బోయపాటి నెక్ట్స్‌ మూవీ హీరో ఎవరు? మళ్లీ బాలయ్య దిక్కు అవుతాడ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 10, 2023 | 02:56 PMLast Updated on: Dec 10, 2023 | 2:56 PM

Tollywood Star Director Boyapati Dikkeveru

స్కంద అట్టర్ ఫ్లాప్‌ తో బోయపాటి ప్లాన్‌ మారిపోయింది. ప్లాన్‌ ఎ వర్కవుట్‌ కాకపోవడంతో.. ప్లాన్‌ బి వైపు చూస్తున్నాడు. కలిసొచ్చిన హీరో కోసం కసరత్తులు స్టార్ట్‌ చేసి.. ఇంకో ఆరు నెలలపాటు కథపైనే కూర్చుంటాడట. ఇంతకీ బోయపాటి నెక్ట్స్‌ మూవీ హీరో ఎవరు? మళ్లీ బాలయ్య దిక్కు అవుతాడ?

స్కంద ప్రమోషన్‌లో నెక్ట్స్‌ మూవీ గురించి బోయపాటి మాట్లాడుతూ.. సూర్య.. అల్లు అర్జున్‌ పేర్లు చెప్పాడు. సూర్యా లైనప్‌ చాలా పెద్దగా వుండడంతో.. ఇప్పట్లో బోయపాటికి డేట్స్ ఇవ్వలేడు. కంగువ తర్వాత కలిసొచ్చిన డైరెక్టర్‌ కొంగర సుధ దర్శకత్వంలో నటిస్తాడు. బోయపాటి రెండేళ్లు వెయిట్ చేయడం కష్టమే. అఖండ సెట్స్‌పై వుండగానే.. బన్నీతో సినిమా వుంటుందన్న టాక్‌ వినిపించింది. బన్నీతో తీసిన సరైనోడు అప్పటివరకు బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పుష్ప 2 పూర్తయితేగానీ.. బన్నీ నెక్ట్స్ మూవీ గురించి ఆలోచించలేడు. ఆగస్ట్‌ వరకు పుష్ప2తో గడిపేస్తాడు. ఈలోగా..అల్లు అర్జున్‌కు నచ్చే కథను బన్నీ రెడీ చేయగలడా? ఒక వేళ చేసినా.. అది పాన్‌ ఇండియా కథై వుండాలి.

హీరోలు.. డైరెక్టర్స్‌కు ఫ్లాపులు రావడం కామనే. ఎంత ఫ్లాప్‌ అయినా ఫర్వాలేదు. కానీ ట్రోలింగ్‌కు గురి కాకూడదు. స్కంద ఓటీటీలోకి వచ్చిన తర్వాత నెటిజన్లు బోయపాటిని ఆడుకున్నారు. దీంతో.. డైరెక్టర్‌ ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్‌ అయింది. స్కంద ఫ్లాప్‌ బోయపాటి మైండ్‌ సెట్‌ను మార్చేసింది. ఏ హీరోతో సినిమా అనుకున్నా.. కథ నచ్చి సెట్స్‌పైకి వెళ్లేవరకు నమ్మకం లేదు. స్టార్ హీరోలే కాదు యంగ్‌ హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. కుర్ర హీరోలలు బెల్లంకొండ.. రామ్‌తో తీసిన ‘జయ జానకి నాయక’.. స్కంద’ ఫ్లాప్‌ కావడంతో.. మరోసారి యంగ్‌ హీరోల ఊసెత్తడం లేదు బోయపాటి.

ఇక బోయపాటి ముందున్న ఆప్షన్‌ అఖండ2 ఒక్కటే. స్కందలా అఖండలో కూడా భారీ ఫైట్స్.. విధ్వంసాలున్నా.. నమ్మశక్యంకాని యాక్షన్‌ సీన్స్‌ వున్నా.. అఘోరాలో శివుడిని చూపించడంతో.. ఓం నమశ్శివాయా అంటూ ఆడియన్స్‌ పెద్దగా పట్టించుకోలేదు. స్కంద విషయంలో ఈ ఓవర్‌ యాక్షన్‌ దెబ్బ కొట్టింది. బోయపాటి వచ్చే ఆరు నెలల్లో అఖండ2 కథను రెడీ చేయాలనుకుంటున్నాడట. బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికావడానికి ఇంకో నాలుగు నెలలు పడుతుంది. ఆతర్వాత నటించే సినిమాను బాలయ్య ఇంతవరకు ప్రకటించలేదు. ఈలెక్కన బోయపాటితో అఖండ2లో నటిస్తాడన్నది లేటెస్ట్‌ న్యూస్‌.

సింహా.. లెజెండ్‌ మాదిరి అఖండ కూడా యాక్షన్‌ మూవీనే అయినా.. బాలయ్యను అఘోరాలా కొత్తగా చూపించి సక్సెస్‌ అయ్యాడు బోయపాటి. మరి అఖండ2లో బాలకృష్ణను ఎలా చూపిస్తాడన్న ఆసక్తి నెలకుంది. భారీ అంచనాలకు తగ్గట్టు బాలయ్య క్యారెక్టర్‌ను ఎలా డిజైన్‌ చేస్తాడు? సీక్వెల్‌ కథను మరింత ఇంట్రెస్టింగ్‌గా ఎలా మలుస్తాడని అందరూ దురుచూస్తారు. ఈలెక్కన బోయపాటి అఖండను మించిన హోం వర్క్‌ చేయాలి. స్కంద డిజాస్టర్‌ నుంచి బైటపడాలంటే.. అఖండ2 హిట్‌ చాలా వసవరం కూడా.