Megastar Chiranjeevi : అపజయం ఎరగని డైరెక్టర్‌తో చిరు..
మెగాస్టార్ చిరంజీవికి భోళాశంకర్ పెద్ద షాక్ ఇచ్చింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. దీంతో.. మెగాస్టార్ తన పంథా మార్చారు. రీమేక్‌లకు గుడ్‌బై చెప్పారు. మంచి కథలపై దృష్టి పెడుతూ వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే 157వ సినిమా విషయంలోదర్శకుడు సహా కథ విషయంలో మెగాస్టార్ తుది నిర్ణయం తీసేసుకున్నారన్న లీకులు అందుతున్నాయి.

Tollywood star hero Megastar Chiranjeevi will be making his 157th film with Apajayam Eragani director Anil Ravipudi.
మెగాస్టార్ చిరంజీవికి భోళాశంకర్ పెద్ద షాక్ ఇచ్చింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. దీంతో.. మెగాస్టార్ తన పంథా మార్చారు. రీమేక్‌లకు గుడ్‌బై చెప్పారు. మంచి కథలపై దృష్టి పెడుతూ వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే 157వ సినిమా విషయంలోదర్శకుడు సహా కథ విషయంలో మెగాస్టార్ తుది నిర్ణయం తీసేసుకున్నారన్న లీకులు అందుతున్నాయి. తొలుత ఈ సినిమాకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. అది నిజం కాదని తేలిపోయింది. చిరంజీవి 157వ సినిమా ఇప్పటి వరకు అపజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడితో ఉండనుందని తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ప్లాన్ లో అనీల్ ఎప్పటి నుంచో ఉన్నారు.. కానీ.. మెగా రేసులో అతని పేరు ఇంత కాలం వినిపించలేదు. అయితే.. ఇటీవల రీమేక్‌లు ఇచ్చిన షాక్‌తో చిరు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే.. తన లేటెస్ట్ మూవీస్ కోసం కొందరు యంగ్ డైరెక్టర్స్ పేర్లను పరిశీలించిన మెగాస్టార్.. చివరకు అనిల్ రావిపూడిని ఓకే చేసినట్లు సమాచారం.. ఇప్పటికే కథా చర్చలు పూర్తి అయ్యాయట.. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన విడుదలకానుందని సమాచారం..
ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట.. ఇక.. చిరంజీవి కామెడీ టైమింగ్, అండ్ అనిల్ రావిపూడి ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇద్దరూ కలిస్తే వెండితెరపై నవ్వులు, పంచ్‌లు ఏ రేంజ్‌లో పడతాయో అందరికీ తెలిసిందే.. దీంతో.. చిరు సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్షన్ అన్న టాక్ వినిపిస్తున్నప్పటి నుంచి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం ఇది మాకు కావాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.