Devara : హాలీవుడ్ రేంజ్‌లో దేవ‌ర

ఆర్ఆర్ఆర్' (RRR) తర్వాత జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర (Devara). ప్యాన్ ఇండియా లెవెల్‌లో రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ జెట్ స్పీడుతో తెర‌కెక్కిస్తున్నాడు. దాదాపుగా షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2024 | 09:40 AMLast Updated on: Mar 13, 2024 | 9:40 AM

Tollywood Star Hero Ntr Devara Movie In Hollywood Range

 

 

 

‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘దేవర (Devara). ప్యాన్ ఇండియా లెవెల్‌లో రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ జెట్ స్పీడుతో తెర‌కెక్కిస్తున్నాడు. దాదాపుగా షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్పటికే బయటకు వచ్చిన జూనియర్ లుక్, గ్లింప్స్‌ ఈ మూవీపై మరింత హైప్‌ను పెంచేశాయి. కాగా.. దేవర మూవీ షూట్‌కి సంబంధించిన లేటెస్ట్ బ‌జ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆర్ఆర్ఆర్ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ (NTR) గ్లోబల్ హీరోగా మారిపోయారు. ఆయన పోషించిన పాత్ర, అందులోని నటనకు అందరూ ఫిదా అయ్యారు. దీంతో.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బేస్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు దేవ‌ర మూవీ కోసం వ‌ర‌ల్డ్ వైడ్ జూనియ‌ర్ ఫ్యాన్స్ ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు. దీంతో.. కొర‌టాల శివ (Koratala Shiva) ఈ మూవీపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టాడు. ఓ విష‌యంలో హాలీవుడ్ రేంజ్‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా దేవ‌ర‌ను తీర్చిదిద్దుతున్నాడట‌

ఇంత‌కీ అస‌లు మ్యాట‌ర్ ఏమిటంటే.. దేవ‌ర మూవీ స‌ముద్రం బ్యాక్‌డ్రాప్‌తో న‌డిచే క‌థాంశంగా తెలుస్తోంది. వీటికి విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎంతో ఇపార్టెంట్ అట‌.. అందుక‌నే.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో టీమ్ ఎంతో శ్రద్ధ వహిస్తోందట.. విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో ఎక్కడా క్వాలిటీలో కాంప్ర‌మైజ్ కావ‌డం లేద‌ట కొర‌టాల అండ్ టీం.. హాలీవుడ్ రేంజ్ అవుట్ ఫుట్ వచ్చేలా ఎంతో శ్ర‌మిస్తున్నారు. దేవ‌ర మూవీ అక్టోబ‌ర్ 10కి వాయిదా ప‌డ్డానికి ఇదే రీజ‌న్ అని చెప్తున్నారు. మ‌రి.. దేవర మూవీ కోసం జూనియర ఫ్యాన్స్‌తో పాటు కామన్‌ ఆడియన్స్‌ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.