Sakshi Vaidya: లెగ్గు పెట్టగానే ఫ్లాపు.. కాని పవన్, మహేశ్, వరుణ్ కి ఆలెగ్గే కావాలి.?
టాలీవుడ్ లో ముగ్గురు హీరోయిన్లు ఎన్ని నక్కల తోకలు తొక్కారో కాని, ఫ్లాపులు పడ్డాకే వాళ్ల తలరాతలు మారాయి. బేసిగ్గా హిట్ పడితే హీరోయిన్ ఫేట్ మారుతుంది. కాని ఇక్కడ విచిత్రం ఏంటంటే లావణ్య త్రిపాఠి, శ్రీలీలా, సాక్షి వైద్య ముగ్గురికి ప్లాపుల తర్వాతే లెక్కమారింది.

Star Heros Want To Flap Actress To Act With them
ఏజెంట్ లాంటి డిజాస్టర్ తో ఎంట్రీ ఇచ్చాకే సాక్షి వైద్య లైఫ్ మారిపోతోంది. అటు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో సెకండ్ హీరోయిన్ రోల్ వచ్చింది. ఇటు మహేశ్ గుంటూరు కారంలో మరదలి పాత్ర వరించింది. వరుణ్ తేజ్, సాయి తేజ్ సినిమాల్లో కూడా సాక్షినే బుక్ చేసుకున్నారట.
ఇలాంటి విచిత్రాలెన్నో శ్రీలీలా కెరీర్ లో జరుగుతున్నాయి. పెళ్లి సందడి అంటూ తను చేసిన మొదటి తెలుగు మూవీ డిజాస్టరైంది. కాని తర్వాతే రవితేజ దమాకా వచ్చింది. తన ఫేట్ మారింది. బాలయ్య కూతురిగా, గుంటూరు కారంలో లీడింగ్ లేడీగా, ఉస్తాద్ భగత్ సింగ్ లవ్ ఇంట్రస్ట్ గా చేస్తూనే డజన్ కి పైనే మూవీలతో టాప్ స్టార్ అయిపోయింది
ఇటు సాక్షి, అటు శ్రీలీలా ఇద్దరూ ప్లాపులతో కూడా స్టార్లైపోతే, లావణ్య త్రిపాఠి ఒక్క ఫ్లాప్ తో తన లైఫే సెటిల్ చేసుకుంది. ఏకంగా మెగా ఫ్యామిలీలో కోడలిగా ఛాన్స్ పట్టేసింది. మిస్టర్ లాంటి ప్లాప్ తో డీలా పడాల్సిన తనకి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమ, ఆతర్వాత పెళ్లి అలా లైఫే మారిపోతోంది.