అలేఖ్య చిట్టిపై టాలీవుడ్ స్టార్ హీరో కన్ను.. పచ్చళ్ళ పాపకు అదిరిపోయే ఆఫర్..!

అలేఖ్య చిట్టి పికిల్స్.. ఈ పేరుకు ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి కథలు కథలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2025 | 04:17 PMLast Updated on: Apr 07, 2025 | 4:17 PM

Tollywood Star Heros Eye On Alekhya Chitti

అలేఖ్య చిట్టి పికిల్స్.. ఈ పేరుకు ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి కథలు కథలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్.. ప్లాట్ఫామ్ తో పనిలేదు అన్నిచోట్ల అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ఫ్రీ పబ్లిసిటీ నడుస్తుందిప్పుడు. వాళ్లు బూతులు తిట్టడం ఏమోగానీ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన రాని పబ్లిసిటీ కేవలం ఆ మూడు నాలుగు బూతులతో వచ్చేసింది. ప్రస్తుతం వాళ్ళ బిజినెస్ బాగా డల్ అయిపోయింది. నోటి దురుసు చూపించడంతో పచ్చళ్ళ వ్యాపారం పూర్తిగా పచ్చడి పచ్చడి అయిపోయిందని తెలుస్తోంది. అందుకే వ్యాపారానికి మాట చాలా ముఖ్యమని చెప్పేది. డబ్బులు ఖర్చు పెట్టుకొని కస్టమర్ ని ఇష్టం వచ్చినట్టు తిడితే సీన్ ఇలాగే సితార అవుతుంది. అయితే ఈ పికిల్స్ మ్యాటర్ కాసేపు పక్కన పెడితే.. ఈ అమ్మాయిలకు టాలీవుడ్ నుంచి ప్రస్తుతం ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే ఒక్కరు కాదు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిపి నడిపే బిజినెస్.

అందులో పెద్దమ్మాయి సుమ ఇప్పటికే సోషల్ మీడియాలో సుమీ టాక్స్ అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బాగా ఫేమస్ అయింది. ఇక రెండో అమ్మాయి మనం మాట్లాడుకుంటున్న మెయిన్ క్యాండిడేట్ అలేఖ్య చిట్టి. మూడో అమ్మాయి రమ్య గోపాలకృష్ణన్. ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్. వాళ్లు చేసే పికిల్స్ బిజినెస్ కు మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ ఈ అమ్మాయే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ గా కనిపిస్తూ తమ పికిల్స్ ను బాగా సేల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది రమ్య. తాజాగా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే త్వరలోనే మొదలు కాబోయే బిగ్ బాస్ 9 కు అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి ఒకరికి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అది అలేఖ్య చిట్టినా లేదంటే రమ్యనా అనేది త్వరలోనే తెలుస్తుంది.

బేసిగ్గా బిగ్ బాస్ లోకి రావాలంటే పెద్దగా క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయితే చాలు. ఈ లెక్కన అలేఖ్య చిట్టి పికిల్స్ పాపులర్ కాదు దానికి నెక్స్ట్ లెవెల్ వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో వీళ్ళలో ఎవరో ఒకరిని బిగ్ బాస్ హౌస్ కు తీసుకుంటే కావలసినంత పబ్లిసిటీ వస్తుంది అనేది నిర్వాహకులు చేస్తున్న ప్లాన్. ఒకవేళ ఇది నిజంగానే వర్కౌట్ అయిందంటే మాత్రం అంతకంటే సంచలనం మరొకటి ఉండదు. సోషల్ మీడియా పుణ్యమా అని అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. అంతేకాదు సినిమా వాళ్లు కూడా వీళ్లను తమ ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్న సారంగపాణి జాతకం ప్రమోషన్స్ లో భాగంగా అలేఖ్య చిట్టి పికిల్స్ ను వాడుకున్నారు. నువ్వు కెరీర్ లో బాగా సెటిల్ కావాలమ్మా అంటూ హీరో హీరోయిన్ తో ఒక స్కిట్ చేయించారు. ఏదేమైనా పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే అలేఖ్య చిట్టి పికిల్స్ ట్రెండింగ్ లో ఉన్నారు. అందుకే అందరూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ అన్నీ కలిసి వచ్చి బిగ్ బాస్ కు వస్తే మాత్రం అక్కడ కూడా వాళ్ళు ట్రెండింగ్ అవ్వడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతుందో..!