ఒక్కొక్కరుగా వచ్చి ఓపెన్ గా తిట్లేనా?. ఒక్కడి ఈగోకి ఎందరు బలి…?

పుష్ప2 కేసు తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఎంటైర్ టాలీవుడ్ పెద్దలు కలిశాక, ఎంటైర్ సీన్ మారిపోయింది. మెల్లిగా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు బయటికొస్తున్నారు. నోరిప్పుతున్నారు. చాలా మందికి బాగా మండినట్టుంది.. లేదంటే కోపం కట్టలు తెంచుకుందేమో కాని, బన్నీ ఓవరాక్షన్ ని ఓపెన్ గానే తిట్టిపోస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2024 | 05:39 PMLast Updated on: Dec 30, 2024 | 5:39 PM

Tollywood Target Allu Arjun In Recent Times

పుష్ప2 కేసు తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఎంటైర్ టాలీవుడ్ పెద్దలు కలిశాక, ఎంటైర్ సీన్ మారిపోయింది. మెల్లిగా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు బయటికొస్తున్నారు. నోరిప్పుతున్నారు. చాలా మందికి బాగా మండినట్టుంది.. లేదంటే కోపం కట్టలు తెంచుకుందేమో కాని, బన్నీ ఓవరాక్షన్ ని ఓపెన్ గానే తిట్టిపోస్తున్నారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ అయితే ఓపెన్ గా ఒక్కడి ఈగో కోసం ఇండస్ట్రీ మొత్తం తలదించుకుందన్నాడు. ఆ మాటలు ఆల్రెడీ వైరలయ్యాయి కూడా… తన తర్వాత సీన్ లోకి నిర్మాత సురేష్ బాబు వచ్చాడు. ఇంకా లిస్ట్ పెరుగుతోంది. ఒక వైపు బన్నీ బేయిల్ పిటీషన్ తాలూకు హియరింగ్ మండేకి వాయిదా పడింది. మరో వైపు బన్నీ విషయంలో ఇండస్ట్రీ అంతా ఒకటై,ఈ హీరోకే ఎసరు పెట్టేస్తోంది. గట్టిగా ఇచ్చిపడేస్తోంది. సీఎం కలిశాక ఇంత మార్పు అంటే రియలైజేషనా..? లేదంటే సీఎం ఇచ్చిన పంచ్ కి తట్టుకోలేని ఫ్రస్ట్రేషనా..? ముంగిట్లో సంక్రాంతి సినిమాలున్నాయి… కాని వాటి నిర్మాతలకు ఎలాంటి ఆశల్లేవు… అన్నీంటికి అరిష్టం, అల్లు అర్జున్ అతి ఈగోయిజమేనా?

సంధ్యా థియేటర్ కేసులో బన్నీ డైరెక్ట్ గా ఏం చేయకున్నా, తన అతి వల్లే ఆ ఇష్యూ అయ్యిందని జనం తన మీద జాలి చూపించటం కూడా ఆపారంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తన ప్రవర్తన, తన అహంకారం, ఈగో వల్లే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సఫర్ అవుతోంది. తల దించుకోవాల్సి వచ్చిందన్నాడు తమ్మారెడ్డి భరధ్వాజ. నిజమే పోలీసులు ఎంత చెప్పినా వినకపోవటమే కాదు, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అంతగా చెప్పినా, కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టి గెలుక్కున్నాడు

లీగల్ కూడా అది కరెక్ట్ కాదని తెలిసి పెట్టిన ఆప్రెస్ మీట్ లో బన్నీ చెప్పినవన్నీ అబద్దాలే అని తేలటంతో, సోషల్ మీడియాలో జనాలు గట్టిగా ఇచ్చిపడేశారు. అంతే వేళ్లన్నీ బన్నీ వైపే చూపించటం మొదలైంది. కట్ చేస్తే సీఎం తో టాలీవుడ్ పెద్దల మీటింగ్.. ఇదేదో కాంప్రమైజ్ వ్యవహారామా అంటే అదేంలేదు, ఇండస్ట్రీ డెవలప్ మెంట్ మీదే చర్చ జరిగిందన్నారు

కాని మురళీ మోహన్ మాటలు బట్టి చూస్తుంటే, బెనిఫిట్ షోలు కావాలి… టిక్కెట్ రేట్లు కొన్ని పెద్ద సినిమాలకు పెంచుకునే వెసులు బాటు లేకపోతే ఎలా అన్న మాటలు ఆలోచనల్లో పడేస్తున్నాయి. అంటే అక్కడ సీఎం బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇవ్వడు, రేట్లు పెంపుకి ఇక నీల్లొదిలినట్లే అని అంతా అనుకున్నా, ఎక్కడో చిన్న ఆశ నిర్మాతల్లో ఉంది..

అసలే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ రాబోతోంది. వెంకి మూవీ సంక్రాంతికి వస్తున్నామంటూ వస్తోంది. బాలయ్య మూవీ ఢాకూ మహారాజ్ ఇలా ఇన్ని సినిమాలొస్తున్నాయి. వీటికి బెనిఫిట్ షోలు ఉండవు, టిక్కటె్ రేట్లు పెరగవంటే, నిర్మాతల చేబులకు చిల్లు పడ్డట్టే…

సీఎంతో మీటింగ్ కి ముందు వరకు ఒక్క నిర్మాత మాట్లాడలేదు కాని, ఆ మీటింగ్ తర్వాత వాళ్లకి ఏమర్ధమైందో కాని, ఒక్కొక్కరిగా బన్నీకి ఇచ్చిపడేస్తున్నారు. సురేష్ బాబు కూడా పరోక్షంగా హీరోలు ప్రవర్తన, ఇంట్లో ఓకే కాని, బయట సరిగా ఉండాలనే విధంగా ఇచ్చిపడేశాడు. దిల్ రాజు అయితే తన ఫ్రస్ట్రేషన్ అంతా మింగేయక తప్పట్లేదు. సంక్రాంతికి తన బ్యానర్ నుంచి రెండు సినిమాలొస్తున్నా ఏం చేయలేని పరిస్థితి… ఏదేమైన ఒక్క హీరో ఈగో వల్ల ఎంటైర్ ఇండస్ట్రీ నష్టపోవటమే కాదు, చేయని తప్పుకి దోషిలా తలదించుకోవాల్సి వచ్చిందనే కామెంట్లు ఓపన్ గా వస్తున్నాయి. ఇంకా ఇంకా ఇవి పెరిగేలా ఉన్నాయి. బేసిగ్గా ఇండస్ట్రీ అంతా ఒక్కటే కాని, ఇండస్ట్రీకే సున్నం పెట్టే పరిస్తితి వస్తే, అందుక్కారణమైన వ్యక్తి స్టారైనా వదలే ప్రసక్తే ఉండదని తేలింది.