Tollywood Vs Kollywood:తెలుగోళ్లని గెంటేస్తున్న తమిళ తంబీలు.. గెట్ ఔట్ అంతే..
తెలుగు వాళ్లకి తీరని అన్యాయం జరుగుతోందా? అనుకోకుండా అవమానం జరిగిందా? ఈ డౌట్లకు బాబీ, దిల్ రాజుకి ఎదురౌన సంఘటనలే ఉదాహరణ అంటున్నారు. రీసెంట్ గా రజినీకాంత్ తో బాబీ మూవీ అన్నారు. తను కూడా తమిళ సూపర్ స్టార్ కి కథ చెప్పాడు. కాని ఏమైంది. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతే, కథ బాలేదని రజినీ గుడ్ బై చెప్పాడట.
ఇదే కాదు గోపీచంద్ మలినేని చెప్పిన కథకి కూడా రజినీ నోచెప్పాడని తెలుస్తోంది. దీంతో దిల్ రాజు, బాబీ, గోపీచంద్ మలినేని ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. చివరికి బాబీ వెళ్లి బాలయ్యతో సినిమా ప్లాన్ చేసుకుని సేఫ్ జోన్ చూసుకుంటున్నాడు. ఇక వంశీ పైడి పల్లితో మరోసారి విజయ్ దళపతి మూవీ అన్నారు. కాని అక్కడా కూడా దిల్ రాజు ఇనీషియేటివ్ తీసుకున్నాడు. ఫైనల్ గా సీన్ చూస్తే విజయ్ దళపతి కూడా వంశీ పైడిపల్లికి నో చెప్పేశాడట.
ఓ వైపు ధనుష్ అండ్ కో తెలుగు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే, మరో వైపు బాబీ, గోపీచంద్ మలినేని, వంశీపైడిపల్లి లాంటి వాళ్లకు తమిళ తంబీలు గెట్ ఔట్ బోర్డులు చూపిస్తున్నారట. ఏదేమైనా ఈ మొత్తం సినారియోలో తెలుగు మాస్ దర్శకులకే కాదు, నిర్మాత దిల్ రాజుకి కూడా పంచ్ పడుతోంది. సూర్యతో బోయపాటి సినిమాని దిల్ రాజు ప్లాన్ చేస్తే అది బెడిసి కొట్టింది. శంకర్ తో చెర్రీ సినిమా ప్లాన్ చేస్తే 170 కోట్ల బడ్జెట్ కాస్త 350 కోట్లు దాటింది.. ఇలా ఉంది పరిస్థితి.