1000 కోట్ల రిస్క్ చేస్తేనే… 1000 కోట్ల మొనగాడు…
టాలీవుడ్ హీరోలో పాన్ ఇండియా హిట్లతో హ్యాట్రిక్ లు సొంతం చేసుకుంటున్నారు. లేదంటే హ్యాట్రిక్ వేటలో పడ్డారు. ఇంకా విచిత్రం ఏంటంటే డబుల్ హ్యాట్రిక్ విషయంలో ఎన్టీఆర్, ప్రభాస్ అయితే నాలుగు అడుగులు ముందే ఉన్నారు. కాని ఇంతవరకు కోలీవుడ్ హీరోలకు పాన్ ఇండియా హిట్ బోనీ పడలేదు.
టాలీవుడ్ హీరోలో పాన్ ఇండియా హిట్లతో హ్యాట్రిక్ లు సొంతం చేసుకుంటున్నారు. లేదంటే హ్యాట్రిక్ వేటలో పడ్డారు. ఇంకా విచిత్రం ఏంటంటే డబుల్ హ్యాట్రిక్ విషయంలో ఎన్టీఆర్, ప్రభాస్ అయితే నాలుగు అడుగులు ముందే ఉన్నారు. కాని ఇంతవరకు కోలీవుడ్ హీరోలకు పాన్ ఇండియా హిట్ బోనీ పడలేదు. పడేలా లేదు. పాన్ ఇండియా హిట్టే కష్టం రా బాబు అనుకుంటుంటే, 1000 కోట్ల వసూళ్లు కూడా తెలుగు హీరోలకి కామనయ్యాయి. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ ఈవిషయంలో థౌజెండ్ వాలాని పేల్చి,మరో సారి అదే పని చేసే పనిలో ఉన్నారు. రెబల్ స్టార్ రెండు సార్లు వెయ్యికోట్లు రాబట్టి మరో మూడు సార్లు అలాంటి రికార్డులకోసమే ప్రయత్నిస్తున్నాడు. ఇలా టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా లెవల్లో సింగిల్ హ్యాట్రిక్ కాదు, డబుల్ హ్యాట్రిక్ తో షాక్ ఇస్తుంటే, అరవ తంబీలు ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అక్కడే ఆగిపోయారు. ఇది ఎన్నడూ ఎవరూ ఊహించని మార్పు… అదెలా సాధ్యమైందో, కొత్తగా డబుల్ హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్ల ట్రెండ్ ఏంటో చూసేయండి.
హిట్ తర్వాత హిట్ రావటమే అరుదంటే, హ్యాట్రిక్ హిట్స్ ఆల్ మోస్ట్ విచిత్రమే.. ఇప్పుడు అంతకంటే సెన్సేషన్ ఏంటంటే, పాన్ ఇండియా లెవల్లో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకోవటం.. అది కూడా వెయ్యికోట్ల వసూళ్లను రాబట్టి హ్యాట్రిక్ కిక్ ఇవ్వటం… అలాంటి రికార్డులు రీసౌండ్ చేసేలా చేస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్..
బాహుబలి1, బాహుబలి 2, సాహోతో పాన్ ఇండియా లెవల్లో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్న ప్రభాస్, తర్వాత సలార్, కల్కీ హిట్ తో ఇప్పడు డబుల్ హ్యాట్రిక్ కి సిద్దమయ్యాడు. ది రాజా సాబ్ కూడా హిట్ అయితే, పాన్ ఇండియా లెవల్లో డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్న ఏకైక పాన్ ఇండియా కింగ్ గా రికార్డు క్రియేట్ చేసినట్టే
ఈవిషయంలో తారక్ త్రిబుల్ ఆర్, దేవర తర్వాత వార్2 తో హ్యాట్రిక్ కిక్ ఇచ్చేందుకు క్యూలో నిలుచున్నాడు. తర్వాత డ్రాగన్,దేవర 2 తో పాటు ధూమ్ 4 కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆల్ మోస్ట్ మరో హ్యాట్రిక్ ని ముందే బుక్ చేసుకున్నాడు.
ఈవిషయంలో కేజీయఫ్, 1,2 తర్వాత టాక్సిక్ తోహ్యాట్రిక్ వేటలో యష్ ఉంటే, పుష్ప2 హిట్ గ్యారెంటీ కాబట్టి తను కూడా ఆతర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో హ్యాట్రిక్ ప్లానింగ్ చేసుకుంటున్నాడంటున్నారు.
విచిత్రం ఏంటేంటే, తమిల్ లో విజయ్, సూర్య, అజిత్ కే కాదు రజినీ కాంత్ కికూడా పాన్ ఇండియా హిట్ ఈమధ్యపడట్లేదు. అసలు వెయ్యికోట్ల వసూల్లైతే వాళ్లకి అందని ద్రాక్షే.. ఇలా అవర హీరోలు, మలయాళ వీరుడు పాన్ ఇండియా కోరికతు తీరక తికమకపడుతుంటే, రెబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ కో మాత్రం పాన్ ఇండియా లెవల్లో హ్యాట్రిక్ హిట్లు, డబుల్ హ్యాట్రిక్ తోపాటు వెయ్యికోట్ల వసూళ్లని కామన్ గా మార్చేస్తున్నారు.