Tollywood War: మెగా”వివాదం”.. గ్లోబల్ స్టార్ VS గ్లోబల్ ఐకాన్..

మెగా హీరోల్లో అల్లు అర్జున్ వర్సెస్ చరణ్ అనే కోల్డ్ వార్ నడుస్తోందా? చరణ్ అంటే తనకు పిచ్చి అన్న బన్నీనే, వెనకనుంచి తన దారెదో తానుచూసుకుంటున్నాడా? ఈడౌట్లని ఇప్పటికే చాలా సంఘటనలు నిజమేమో అనిపించేలా చేశాయి. తాజాగా గ్లోబల్ ఐకాన్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపేన్ చూస్తే, చరణ్ ఫ్యాన్స్ కి ఇది అల్లు కౌంటర్ అంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2023 | 10:30 PMLast Updated on: Mar 28, 2023 | 11:20 PM

Tollywood War On Mega Family

మెగా హీరోల్లో ఆల్రెడీ బన్నీ బ్యాచ్, మెగా ఫ్యాన్స్ సెపరేట్ అనే భావనుంది. పైకి ఎన్ని మాట్లాడుకున్నా, మెగా స్టాంప్ చెరిపేసుకునేందుకు అల్లు అర్జున్ ఓ ఫ్యాన్ బేస్ ని సెపరేట్ గా రెడీ చేసుకున్నాడనే వాదనుంది. అల్లు ఇంటిపేరుని ఫోకస్ చేసేలా తనకంటూ సెపరేట్ ఐడెంటీటీతో ముందుకెళుతున్నట్టు కనిపిస్తోంది.

ఐతే రీసెంట్ గా త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ రావటం, హాలీవుడ్ లో తారక్ తోపాటుచరణ్ ఫోకస్ అవటం, ఇక నాటు పాట వల్ల ప్రత్యేక గుర్తింపు రావటంతో, ఫ్యాన్స్అంతా తనని గ్లోబల్ స్టార్ అంటున్నారు. కరెక్ట్ గా ఇదే సమయంలో బన్నీ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోని ఐకాన్ స్టార్ గా కాకుండా గ్లోబల్ ఐకాన్ అంటున్నారు

సో గ్లోబల్ స్టార్ అంటూ చరణ్ ఫ్యాన్స్ చేసే సందడికి, గ్లోబల్ ఐకాన్ అంటూ బన్నీ కోసం ఫ్యాన్ చేసే సోషల్ మీడియా క్యాంపేన్ కౌంటర్ అంటున్నారు. ఇలా ఇప్పుడు ఈ మెగా రచ్చ సోషల్ మీడియాలో పెరిగిపోయింది.