బాలీవుడ్ పై మరో కిస్సిక్.. యంగ్ హీరోని బుట్టలో వేసిన శ్రీలీల
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస చాన్సులు కొట్టేస్తుంది. యంగ్ హీరోలతో పాటుగా సీనియర్ హీరోలు సినిమాల్లో కూడా నటించేస్తోంది.

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస చాన్సులు కొట్టేస్తుంది. యంగ్ హీరోలతో పాటుగా సీనియర్ హీరోలు సినిమాల్లో కూడా నటించేస్తోంది. ఇక ఐటెం సాంగ్స్ బోనస్. రీసెంట్ గా పుష్ప సీక్వెల్ లో ఈమె డాన్స్ కు జనాలు ఫిదా అయిపోయారు. కిసిక్ అనే సాంగ్ కు ఈమె వేసిన స్టెప్పులు యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేసేసాయి. ఇక శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ వైపు ఎక్కువగా చూస్తోంది. బాలీవుడ్ లో కాస్త గ్యాప్ కనబడుతోంది.
ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి మన తెలుగు హీరోయిన్లు గట్టిగానే కష్టపడుతున్నారు. అదే పనిలో పడింది శ్రీలీల. ప్రస్తుతం నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మాయి.. తర్వాత మాస్ మహారాజా రవితేజ పక్కన మాస్ జాతర సినిమాలో నటిస్తోంది. దీనితో ఈ బ్యూటీ బాక్సాఫీస్ దగ్గర వరుస హిట్లు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేయనుంది.
ఈ సినిమాను త్వరలోనే స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ఇప్పటికే వర్కౌట్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సినిమాలో హీరోయిన్ గా ఈమె నటిస్తోందని బి టౌన్ వర్గాలు అంటున్నాయి. తన మొదటి సినిమా స్టార్ట్ అవ్వకుండానే రెండో సినిమాకు ఆమె ఓకే చెప్పేయడం సెన్సేషన్ అవుతుంది. ఇక తమిళంలో కూడా సూర్య హీరోగా వస్తున్న ఒక సినిమాకు ఈమె అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇలా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. దీపం ఉండగానే వెళ్లి చక్కబెట్టుకోవాలి అనే సామెతను పక్కాగా ఫాలో అవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ పైన ఈమె ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో హీరోయిన్ లు అందరూ సీనియర్లు అయిపోయారు. బాలీవుడ్ కూడా కొత్త హీరోయిన్ల వైపు ఎక్కువగా చూస్తోంది. దీనితో ఆ ఖాళీని ఎలాగైనా సరే తను ఫిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రష్మిక మందన వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో రష్మిక నటించిన ప్రతి మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇలా శ్రీలీల కూడా అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక మన తెలుగులో రవితేజ పక్కన ఈమె నటిస్తోంది. సీనియర్ హీరో పక్కన కూడా ఆమె ఏమాత్రం భయపడకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. మరి ఆ సినిమాలో ఆమెకు ఏ రేంజ్ లో రోల్ ఇస్తారో చూడాలి.